మ‌రోసారి టీడీపీలో భ‌గ్గుమ‌న్న వ‌ర్గ విభేదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp flag
Updated:  2018-08-23 04:24:40

మ‌రోసారి టీడీపీలో భ‌గ్గుమ‌న్న వ‌ర్గ విభేదాలు

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో వ‌ర్గ విభేదాలు ఏ ఒక్క ప్రాంతానికి ప‌రిమితం కావ‌డం లేదు. ఏదో ఒక ఈవెంట్ లో కార్య‌క‌ర్త‌లు త‌గాదాలు ప‌డుతూనే ఉన్నారు.
 
యితే ఇదే క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా శ్రీకాళహ‌స్తిలో మ‌రోసారి టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. అన్నా క్యాంటిన్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఎమ్మెల్యే బొజ్జ‌ల కృష్ణా రెడ్డిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌లు ఫైర్ అయ్యారు.
 
అన్నా క్యాంటిన్ ప్రారంభోత్స‌వానికి శ్యాప్ చైర్మ‌న్ పీఆర్ మోహ‌న్‌ను ఆహ్వానించ‌లేదు. దీంతో ఆయ‌న ఆగ్ర‌హించి క్యాంటిన్ ప్రారంభోత్స‌వాన్ని చేసి వెళ్తున్న బొజ్జ‌ల వాహనాన్ని అడ్డుకున్నారు. ద‌శాబ్దాలుగా పార్టీలో ఉంటున్న త‌మ‌కు ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కులు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని ఆయ‌న‌ మండిప‌డుతున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.