లక్ష కోట్ల ఆరోపణ‌ల్లో నిజమెంత?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 13:37:24

లక్ష కోట్ల ఆరోపణ‌ల్లో నిజమెంత?

మహానేత దివంగత రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుండి ఇప్పటివరకు టీడీపీ నాయకులు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై లక్షకోట్ల అవినీతి చేశాడంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు...జగన్ పై వస్తున్న ఈ లక్ష కోట్ల ఆరోపణ‌ల్లో నిజమెంత? అసలు లక్ష కోట్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉందా? జగన్ ఛరిష్మాను ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు, జగన్ వ్యక్తిత్వాన్ని చంపేయడానికి లక్ష కోట్ల అవినీతి ఆరోపణ‌లు అంటూ కొత్త డ్రామాకి తెరతీశారా?
 
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ టీడీపీ ప్రచారం చేసింది... వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి టీడీపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది...అందుకే 9 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు...
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల  కాలంలో ప్రజలు గుర్తించుకునే పథ‌కాలు ఒకటి కూడా లేదు..రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో పథ‌కాలను ప్రవేశపెట్టారు...అన్ని పథ‌కాలు కర్చుతో కూడుకున్నవే...ఆరోగ్య శ్రీ తో ప్రజల ప్రాణాలను నిలబెట్టారు...ఫి - రీయింబర్సుమెంట్ తో ఉచితంగా చదువులు చెప్పించారు..రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు...
 
రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చారు...కరెంట్ బకాయిలను రద్దు చేశారు... ఇలా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఖజానాతో నడిచే ఎన్నో పథ‌కాలను ప్రవేశపెట్టినప్పటికీ జగన్ లక్ష కోట్లు అవినీతికి పాల్పడితే, 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథ‌కాన్ని కూడా ప్రవేశపెట్టని చంద్రబాబు ఎన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ఉంటాడో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...
 
రాజశేఖర్ రెడ్డి ఖర్చుతో కూడుకున్న ఎన్నో పథ‌కాలను ప్రవేశపెట్టి, ఆ పథకాలన్నీ రాష్ట్ర బడ్జెట్లోనే చేస్తే ఇంచుమించు అదే బడ్జెట్ తో రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ఏ పథ‌కాన్ని ప్రవేశపెట్టకుండా ఆ డబ్బంతా ఏమి చేసిన్నట్టు... రాజశేఖర్ రెడ్డికి సాధ్యమైంది, చంద్రబాబుకు ఎందుకు సాధ్యం కాలేదు, ఇలా అయితే చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో అంటున్నారు ప్రజలు...
 
రాజశేఖర్ రెడ్డి ఇన్ని పథ‌కాలను రాష్ట్ర బడ్జెట్ లోనే ప్రవేశపెట్టగలిగారంటే, ప్రజలకు ఏమి చేయని చంద్రబాబు ఎన్ని లక్ష కోట్లు దోచుకున్నారో ఆలోచించండి...ఎవరు ప్రజల పక్షాన నిలబడ్డారో, ఎవరు కుట్ర రాజకీయాలు, ప్రజలకు ఏమి చేయకుండా అనుకూల మీడియాతో భజన చేపించుకుంటున్నారో గమనించండి...బాబు 9 ఏళ్ల పాలనను, రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ల పాలనను బేరీజు చేసుకోండి...
 
ఎవరు దొంగో, ఎవరు దొరో మీరే నిర్ణయించుకోండి... ఇన్ని పథ‌కాలను ప్రవేశపెట్టిన లక్ష కోట్లు జగన్ దోచుకున్నారు అని చేసే ఆరోపణ‌ల్లో నిజమెంతో తెలుసుకోవడానికి రాజశేఖర్ రెడ్డి - చంద్రబాబు పాలనను చూసి నిర్ణయించుకోండి...జగన్ ధైర్యంగా కేసులను ఎదుర్కొంటుంటే, ఏ అవినీతి చేయకపోతే 18 కేసులలో స్టేలు ఎందుకు తెచుకున్నారో ఒక్కసారి ఆలోచించండి..అన్ని ఆలోచిస్తే నిజానిజాలు మీకే తెలుస్తాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.