టీడీపీకి మంత్రి గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 17:53:49

టీడీపీకి మంత్రి గుడ్ బై

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం ఏ కార్య‌క్ర‌మానికి స్వీకారం చుట్టినా కానీ ఆయ‌న‌కు అనుకూలంగా స‌హ‌క‌రించ‌కుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.... 2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజారిటీతో అధికారంలో వ‌చ్చిన చంద్ర‌బాబుకు ప‌రోక్షంగా కానీ, ప్ర‌త్య‌క్షంగా కానీ ఏదో ఒక రూపంలో అడ్డంకులు వ‌స్తూనే  ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు... అయితే వాటిని స‌రిచేసుకునే టైమ్ లోప‌లే తెర‌పైకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదో ఒక వివాదం తీసుకుని వ‌చ్చి చంద్ర‌బాబు నేత్తిమీద పెడుతుంటారు నాయ‌కులు... దీంతో చంద్ర‌బాబు ఏం చేయాలో దిక్కు తోచ‌క స‌త‌మ‌త‌మ‌వుతూ లోలోప‌లే భాద‌ ప‌డుతుంటార‌ని స‌మాచారం.
 
ఈ స‌త‌మ‌త నేప‌థ్యంలోనే సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి... క‌ళ్లు మూసి క‌ళ్లు తెరిసే లోపు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి... దీంతో చంద్ర‌బాబు ఏం చేయాలో ఆలోచ‌న‌లో ప‌డినట్లు తెలుస్తోంది... ఇక ఇప్ప‌టికే  కేంద్రం ప్ర‌త్యేక హోదాను ఏపీకి కేటాయించ‌లేద‌ని నెపంతో గ‌రం గ‌రంగా ఉన్నారు రాష్ట్ర‌ప్ర‌జ‌లు.. అయితే దీనికి ముఖ్య కారణం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు కార‌ణ‌మ‌ని చెబుతుంటారు ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు... ఇక గతంలో  చంద్ర‌బాబు కేంద్రంతో మిత్ర‌ప‌క్షం వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న యూ-ట‌ర్న్ తీసుకున్నాని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి... ఇక  ప్ర‌స్తుతం ఇదే విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు కుడా ఆలోచిస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు న‌మ్మ‌క ద్రోహం- కుట్ర రాజ‌కీయాలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్మ పోరాటం పేరుతో దీక్షలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే... అయితే ఈ దీక్ష పై ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా త‌ప్పు బ‌డుతున్నారు... గత ఎన్నికల్లో నెరవేర్చలేని హామీలు ప్ర‌క‌టించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు కొత్త నాట‌కాల‌కు తెర లేపుతున్నార‌ని మండిప‌డుతున్నారు... ఇక‌ ఈ ఫీడ్ బ్యాక్ ను గ‌మ‌నించిన టీడీపీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల దృష్ట్యా పార్టీ మారేందుకు సిద్దమ‌య్యార‌ని తెలుస్తోంది... అయితే ఈ వ‌రుస‌లో సుజ‌నా చౌద‌రి ముందంజ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
 
 ఇక తాజాగా మ‌రో మంత్రి టీడీపీకి  బాయ్ చెప్పేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కుల తాజా స‌మాచారం... చంద్ర‌బాబు అత్యంత స‌న్నిహితుడుగా వ్య‌వ‌హ‌రించిన ఈ మంత్రి.. టీడీపీకి రానురాను  డిస్టెన్స్ పాటిస్తున్నార‌ని విశ్లేష‌కుల చెబుతున్నారు... ఇటీవ‌లే  క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌ బీజేపీ నుంచి టీడీపీలోకి వ‌స్తున్నార‌ని వార్తుల వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే... అయితే ఆయ‌న పార్టీలో చేరే వ్య‌వ‌హారాల‌న్ని చంద్ర‌బాబు ఒక మంత్రికి అప్ప‌గించారు.... ఆ మంత్రి చంద్ర‌బాబు ముందు స‌క్క‌గా త‌ల ఊపినా కానీ, ఆ మంత్రి వ్య‌వ‌హ‌రించిన తీరును బ‌ట్టి  క‌న్నా వైసీపీలో జంప్అయ్యేందుకు స‌ద్ద‌మ‌య్యారు.... అయితే ప్ర‌స్తుతం ఇదే విష‌యం పై  టీడీపీలో చర్చనీయాంశంగా మురుతోంది.
 
ఇక దీనిని బ‌ట్టి చుస్తుంటే మ‌రి కొద్ది రోజుల్లో ఈ మంత్రి టీడీపీకి టాటా చెప్పెందుకు సిద్దంగా ఉన్నార‌ని తాజా రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం.. అయితే ప్ర‌స్తుతం ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారుతోంది... టీడీపీ నాయ‌కులు పార్టీ మార‌డానికి కార‌ణం ప్ర‌తిక్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత త‌ల‌పేట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రనే కార‌ణ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.. ఈ యాత్ర‌లో ప్ర‌జ‌లు జ‌గ‌న్  బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న తీరును చూసి టీడీపీ నాయ‌కులు ప్ర‌స్తుతం చంద్రబాబు చెప్పిన మాటలు లెక్క చేయడం లేదు అని అంటున్నారు విశ్లేష‌కులు

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.