10వేల కోట్లు దిగమింగిన తెలుగు తమ్ముళ్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

buggana rajendrandh reddy
Updated:  2018-04-02 12:54:16

10వేల కోట్లు దిగమింగిన తెలుగు తమ్ముళ్లు

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రాష్ట్ర‌వ్యాప్తంగా అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కులు అవినీతికి పాల్ప‌డ‌ని విధంగా టీడీపీ నాయ‌కులు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. టీడీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన నీరు–చెట్టు కార్య‌క్ర‌మంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయ‌కులు సుమారు 10 వేల కోట్ల రూపాయ‌ల‌ను దిగ‌మింగార‌ని ఆరోపించారు.
 
కర్నూలు జిల్లా డోన్‌ మండలంలోని వలిసెల గ్రామంలో ఏర్పాటు చేసిన‌ వైఎస్సార్‌సీపీ రచ్చబండ కార్యక్రమానికి బుగ్గ‌న రాజేంద్రనాథ్‌ రెడ్డి హ‌జ‌ర‌య్యారు...ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ఆయ‌న‌ ఉపాధిహ‌మీ పనులకు సంబంధించిన‌ జాబ్‌కార్డులన్నీ కేవ‌లం అధికారపార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యుల‌ పేర్ల మీద ఉన్నాయని తెలిపారు. పనులు చేపట్టకపోయినా రికార్డుల్లో చేసినట్లు చూపి కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులను తెలుగు తమ్ముళ్లు వ‌శం చేసుకుంటున్నార‌ని ఆరోపించారు.
 
గృహ నిర్మాణ పథకంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ప‌సుపు నామ‌కుల పై బుగ్గన ధ్వజమెత్తారు. ఒక్కొక్క లబ్ధిదారుని నుంచి టీడీపీ నాయకులు రూ.20వేల రూపాయల వరకూ అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలిపారు.  మరుగుదొడ్ల నిర్మాణంలో వెలుగు చూసిన అవినీతి టీడీపీ నేతల బరితెగింపునకు నిదర్శనమని చెప్పారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌టువంటి కందుల కోనుగోలు కేంద్రాల్లో టీడీపీ నాయ‌కులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రైతాంగాన్ని నిలువు దోపిడి చేస్తున్నార‌ని బుగ్గ‌న ఆరోపించారు..  కర్నూలును ఓడీఎఫ్‌ (బహిరంగ మలమూత్ర రహిత) జిల్లాగా ప్రకటించడం దారుణమని బుగ్గన వ్యాఖ్యానించారు. వలిసెల గ్రామంలో 250 ఇళ్లుంటే ఇప్పటివరకు 80 ఇళ్లకు మరుగుదొడ్లే లేవనే సంగతి అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.