పెయిడ్ ఆర్టిస్ట్ ల గుట్టుర‌ట్టు చేసిన విజ‌య‌సాయిరెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijayasaireddy image
Updated:  2018-03-05 03:20:42

పెయిడ్ ఆర్టిస్ట్ ల గుట్టుర‌ట్టు చేసిన విజ‌య‌సాయిరెడ్డి

ప్ర‌త్యేక హూదా సాధ‌నే ల‌క్ష్యంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ హిస్తిన‌లో త‌మ గ‌ళం విప్పింది.. ఏపీకి  ప్ర‌త్యేక హూదా ఇచ్చి తీరాల్సిందే అని కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చేలా  కేంద్రం పై త‌మ పోరును త‌ల‌పెట్టింది వైసీపీ ..సంస‌ద్ మార్గ్ లో ధ‌ర్నా చేప‌ట్టారు వైసీపీ నాయ‌కులు... ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ  ప్ర‌జా ప్ర‌తినిధులు మేధావి వ‌ర్గం తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.. ఇక వీరిని అక్క‌డ పోలీసులు అరెస్ట్ చేయ‌డం తో అక్క‌డ కాస్త ఉద్రిక్తత వాతావ‌ర‌ణం  ఏర్ప‌డింది. పోలీసులు ప‌లువురు వైసీపీ నాయ‌కుల‌ను  పార్లమెంట్ కు వెళ్లేదారిలో అడ్డుకున్నారు.
 
ఇక వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం ప్ర‌భుత్వం పై మండిప‌డ్డారు.. 2015 లో కూడా ప్ర‌త్యేక హూదా కోసం మా పార్టీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డ నుంచే ధ‌ర్నా చేశారు అని, అప్పుడు కూడా త‌మని అడ్డుకున్నారు అని ఆ స‌మ‌యంలో అరెస్ట్ లు చేసి మా ధ‌ర్నాని అడ్డుకున్నారు అని గుర్తుచేశారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఎన్ని అడ్డంకులు ఎదురు అయినా మా పోరాటం కొన‌సాగిస్తాం అని తెలియ‌చేశారు విజ‌య‌సాయిరెడ్డి.
 
ఇక ప‌వ‌న్ జేఎఫ్ సి అంతా బాబు ఆడుతున్న నాట‌కం అని అన్నారు విజ‌య‌సాయిరెడ్డి .....ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా అని ఆయ‌న కొట్టిపారేశారు... దీనికి  నిర్మాత, ద‌ర్శ‌క‌త్వం  చంద్ర‌బాబు అని అన్నారు విజ‌య‌సాయిరెడ్డి..  
 
ఈ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీలో అంద‌రూ పెయిడ్ ఆర్టిస్టులు అని ఆయ‌న విమ‌ర్శించారు.. ఏపీలో ప్ర‌జ‌లు అంద‌రూ ఈ అవినీతి ప్ర‌భుత్వ పాల‌న చూస్తున్నారు అని వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఓటు వెయ్యాలో తెలుసు అని ఫైర్ అయ్యారు విజ‌య‌సాయిరెడ్డి... ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన‌ట్లు తాము అవిశ్వాస తీర్మానం పెడ‌తాము దానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌వ‌ల‌సిన ప‌ని ప‌వ‌న్ ది అని గుర్తుచేశారు.. ఇప్పుడు ఇది స‌రైన‌ది కాదు అని అన‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు అంద‌రూ గ‌మినిస్తున్నారు అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలియ‌చేశారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.