ఇటు హ‌రికృష్ఱ అంత్య‌క్రియ‌లు పూర్తికాగానే అటు మ‌రో ప్రాణం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

palle raghu nadha reddy wife
Updated:  2018-08-31 01:26:49

ఇటు హ‌రికృష్ఱ అంత్య‌క్రియ‌లు పూర్తికాగానే అటు మ‌రో ప్రాణం

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నంద‌మూరు హ‌రికృష్ణ చ‌నిపోయార‌న్న మ‌ర‌ణ‌వార్త మ‌రువ‌క‌మందే మ‌రో విషాదం చోటు చేసుకుంది అదే పార్టీకి చేందిన అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి స‌తీమ‌ణి బాలాజీ విద్యాసంస్థ‌ల క‌ర‌స్పాండెంట్ ఉమాదేవి నిన్న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో మర‌ణించారు. కొద్దికాలంగా అనారోగ్య ప‌రిస్థితితో బాద‌ప‌డుతున్న ఆమెకు కుటుంబ స‌భ్య‌లు హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స చేయిస్తున్నారు. 
 
అయితే ఉమాదేవి ఆరోగ్యం విష‌మించ‌డంతో నిన్న 3గంట‌ల 46 నిమిషాలకు మృతి చెందారు. నంద‌మురి హ‌రికృష్ణ అంత్య‌క్రిలు పూర్తి అవ్వ‌గానే ఈమె మ‌ర‌ణించ‌డంతో పార్టీ నాయ‌కులను షాక్ కు గురిచేస్తోంది. ఉమాదేవి అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల మండ‌లం సోద‌న‌ప‌ల్లెకు చెందిన ఆమె ఒక సాధార‌ణ కుటుంబంలో జ‌న్మించింది. 1979లో ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డితో ఆమెకు వివాహం అయింది. 
 
వీరిద్ద‌రి దంప‌తుల‌కు ఒక కుమారుడు ఉన్నాడు. త‌న భ‌ర్త ఎమ్మెల్యే అయ్యేందుకు ఉమాదేవి కీల‌క పాత్ర పోషించేవారు. అంతేకాదు బాలాజీ విద్యాసంస్థ‌ల ద్వారా అమె ఎంతోమందికి ఉపాధిని కూడా క‌ల్పించారు. అయితే ఇటీవ‌లే ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ నిన్న ఆసుప‌త్రిలో మృతి చెందారు.
 
ఇక ఈ విష‌యం తెలుసుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు మంత్రిలోకేశ్ హిదూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ, హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు పూర్తి కాగానే అటునుంచి అటే ఉమాదేవి ఉన్న‌ ఆసుప‌త్రికి చేరుకుని ఆమెకు నివాళులు అర్పించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.