పార్థసారధి సవాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pardhasaradhi saval to ap cm
Updated:  2018-03-30 05:32:49

పార్థసారధి సవాల్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ది ప‌ర‌చాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను, ప్ర‌త్యేక‌హోదాను ప్ర‌క‌టించాలంటూ నిర్విరామంగా పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీని పై అధికార తెలుగుదేశం పార్టీ అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేస్తోంది అని ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తోంది....దీనికి  స్పందించిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి సీఎం చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు.
 
వైసీపీ చేస్తున్న హోదా పోరాటాన్ని త‌ప్పుదారి ప‌ట్టించే విధంగా సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌త్యేక‌హోదా సాధించ‌డానికి ఏపీలో ఉన్న అంద‌రి ఎంపీల‌తోను రాజీనామా చేయించి, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేద్దామని వైసీపీ పిలుపునిస్తే దానికి చంద్ర‌బాబు ఆస‌క్తి చూప‌డం లేద‌ని అన్నారు. విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప్ర‌త్యేక హోదా కోసం చిత్త‌సుద్దిగా పోరాటం చేస్తే త‌మ ప్ర‌భుత్వ అవినీతి, అక్ర‌మాల‌ను కేంద్రం ఎక్క‌డ‌ వెలికితీస్తుందో అన్న భ‌యం చంద్ర‌బాబుకు ప‌ట్టుకుంద‌ని అన్నారు. 
 
అందుకే హోదా పోరాటంలో బాబు పూట‌కోమాట మాట్లాడుతున్నార‌ని  ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమే టీడీపీ పోరాటం చేస్తుంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా ఉద్య‌మాన్ని ఉధృతం చేయాలంటూ చంద్రబాబుకు పార్థసారధి సవాల్ విసిరారు.
 
టీఆర్‌య‌స్ ఎంపీలు రాజీనామాలు చేయ‌డం వ‌ల్ల‌నే కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. హోదా కోసం కలిసి రావాలంటే చంద్రబాబు మాత్రం వెనకడుకు వేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  నిజంగా చంద్రబాబుకు ఏపీకి ప్రయోజనాలు చేకూర్చాలని, హోదా సాధించాలని చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇప్పటివరకూ చేస్తున్న మోసాలు, నాటకాలను ఇక ఆపాలంటూ పార్థసారధి హితవు పలికారు. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాల వ‌ల్ల‌నే చంద్ర‌బాబు యూ టర్న్ తీసుకుని  హోదా జపం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.