బాబును ఆ విష‌యంలో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా గుర్తించాలి...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp leader pardhasaradhi image
Updated:  2018-03-11 11:17:19

బాబును ఆ విష‌యంలో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా గుర్తించాలి...

విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాల‌ను కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించ‌కపోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి ప‌క్షాలు, మిత్ర ప‌క్షాలు !! సేవ్ !! ఏపీ అంటూ నిర‌స‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే... అయితే 2014 ఎన్నిక‌ల త‌ర్వాత  ఎన్డీఏ ప్ర‌భుత్వంతో చంద్రబాబు స‌ర్కార్ వారితో నాలుగు సంవ‌త్స‌రాల పాటు మిత్రప‌క్షంగా పొత్తును కొన‌సాగిస్తూ వ‌చ్చినా కానీ, విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన‌ ఒక్క అంశాన్ని కూడా సాధించ‌లేక పోయారు అధికార టీడీపీ నాయ‌కులు... దీంతో ప్ర‌తి ప‌క్షాలు నేత‌లు తెర‌పైకి వ‌చ్చి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.. అలాగే పార్ల‌మెంట్ లో త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న‌లు చేస్తున్నారు ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు.
 
అయితే తాజాగా వైసీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై మండిప‌డ్డారు.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబు ప్ర‌జ‌ల‌ను వెన్నుపోటు పొడుస్తున్నార‌ని ఆయ‌న అన్నారు... ఆయ‌న చేస్తున్న  మోసాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెబుతార‌ని తెలిపారు.
 
గ‌తంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కంటే ప్ర‌త్యేక ప్యాకేజీ  వ‌ల్లే అధిక లాభం  ఉంద‌న్న చంద్ర బాబు మ‌ళ్లీ స్వ‌రం మార్చి ప్ర‌త్యేక హోదా కావాలంటున్నార‌ని పార్థ‌సార‌ధి అన్నారు.. అయితే ఇటు రాజ‌కీయాల‌కు, అటు ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌డంలో బాబుకు మొద‌టి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని వెల్ల‌డించారు ఆయ‌న ... దీంతో పాటు వెన్నుపోటు పోడ‌వ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా గుర్తించాల‌ని పార్థ‌సార‌ధి పేర్కొన్నారు... కాగా టీడీపీ మంత్రులు వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసినా.. ఎన్డీయేలో కొనసాగడం మోసపూరితం కాదా అని పార్థసారధి ప్రశ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.