బాబు హయాంలో మ‌రో అవినీతి చ‌ట్టం బీ అల‌ర్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-07-31 05:37:14

బాబు హయాంలో మ‌రో అవినీతి చ‌ట్టం బీ అల‌ర్ట్

2019లో మ‌రోసారి అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల దృష్టిని మార్చి తాను చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాయ‌మాటలు, ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ సోష‌ల్ మీడియాలో ట్వీట్లు, మ‌రో టీడీపీ మంత్రి య‌న‌మ‌ల‌ ప్రెస్ మీట్ల‌తో ప్ర‌జ‌ల్లో అసోహ రాజకీయాల‌ను చేస్తూ చాపకింద నీరులా దుర్మార్గ‌మైన చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
రాజ్యాంగం ప్ర‌కారం దేశంలో భూ సేక‌ర‌ణ చ‌ట్టాలు ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వం ప్రైవేట్ వ్య‌క్తుల నుంచి భూముల‌ను తీసుకోవాలంటే వారికి ఏ విధంగా న్యాయం చెయ్యాలి అనే విష‌యాల‌ను పూర్తిగా రైతుల‌కు వివ‌రించి ఆ త‌ర్వాత  ప్ర‌భుత్వం భూముల‌ను తీసుకోవాల‌ని ఆయ‌న గుర్తు చేశారు. 
 
అయితే ఈ చట్టానికి వ్య‌తిరేకంగా మొద‌టి సారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రైతుల పొట్ట‌కొట్టే విధంగా భూ సేక‌ర‌ణ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. అయితే ఆ చ‌ట్టాన్ని వ్య‌తిరేకంగా రైతులే కాకుండా రాష్ట్ర ప్ర‌జ‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ దుర్మార్గ‌పు దోపిడీ చ‌ట్టాన్ని అడ్డుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
 
భారత దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఇంత దుర్మార్గ‌పు చ‌ట్టాన్ని తీసుకురావ‌టానికి కృషి చేయ‌లేద‌ని కానీ మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. 2013 భూ సేక‌వ‌ర‌ణ చ‌ట్టానికి  వ్య‌తిరేకంగా కొత్త భూ సేక‌ర‌ణ చ‌ట్టాన్ని తీసుకు వ‌స్తే రైతుల భూములు అక్ర‌మంగా లాక్కుంటార‌ని తెలిపారు. చంద్ర‌బాబు రాజ‌కీయ లబ్దీ కోసం తాను సింగ‌పూర్ లా రాజ‌ధానిని నిర్మిస్తాన‌ని, పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మించేశాను అప్పుడే నీళ్లు కూడా వ‌స్తున్నాయని, విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీ అభివృద్ది చెందింద‌ని చెప్పి గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని పార్థ‌సార‌థి ఆరోపించారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.