ప‌రిటాల కుటుంబం నుంచి నాకు ప్రాణ‌హాని ఉంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-06 16:39:00

ప‌రిటాల కుటుంబం నుంచి నాకు ప్రాణ‌హాని ఉంది

ఏపీ అధికర‌ తెలుగుదేశం పార్టీ మంత్రి ప‌రిటాల సునిత వైఖ‌రి ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లాలో తీవ్ర వివాధాల‌కు దారి తీస్తోంది. ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్తలు, అలాగే నేత‌ల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు అధికం అవుతున్నాయి. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి కీల‌క పాత్ర పోశించిన ప్ర‌సాద్ రెడ్డిని 2015 ఏప్రెల్ 29న మంత్రి ప‌రిటాల సునిత వ‌ర్గీలు రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం త‌హ‌సిల్దార్ ఆఫీస్ లోనే దారుణంగా హ‌త్య‌చేశారు. 
 
అయితే ఈ హ‌త్య‌కు పోలీసులు రెవెన్యూ సిబ్బంది స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి.  ఆ త‌ర్వాత ఆయ‌న సోద‌రుడు మ‌హానంద‌రెడ్డి క్రియా శీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వైసీపీ యువ‌జ‌న విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ‌తీయ్యాల‌నే ప్ర‌య‌త్నంలో టీడీపీ నేత‌లు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సూమారు 5 ఎక‌రాల‌ భూమిని 1996లో ప్ర‌సాద్ రెడ్డి కొనుగోలు చేశారు. ఇన్నాళ్లు ప్ర‌సాద్ రెడ్డి కుటింభికులు ప‌రిధిలో ఉన్న ఆ భూమి రికార్డులో ప్ర‌స్తుతం తారుమారు అయ్యాయి. 
 
ప్ర‌స‌న్నాయ గ్రామానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త చండ్రాయుడ్ పేరిట రాత్రికి రాత్రే రాప్తాడు రెవిన్యూ అధికార‌లు మార్చేశారు. అయితే ఇది ఖ‌చ్చ‌తంగా మంత్రి పరిటాల‌ సునిత ఆదేశాల‌తోనే జ‌రిగింద‌ని మ‌హానంద‌రెడ్డి అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ నాయ‌కులు త‌న‌ను ఏదో ఒక వివాదంలోకి లాగి త‌న అన్న‌ను హ‌త‌మార్చిన‌ట్లే త‌న‌ను కూడా హ‌త్య‌చేసేందుకు ప‌రిటాల వ‌ర్గీలు కుట్ర‌లు ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. మంత్రి ప‌రిటా సునిత కుటుంబం నుంచి త‌నకు త‌న‌కుటుంబీకుల‌కు ప్రాణ‌హాని ఉంద‌ని మ‌హానంద‌రెడ్డి వ్య‌క్తం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.