వైకాపాలోకి పరిటాల కీలక అనుచరుడు.. చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-12 01:56:54

వైకాపాలోకి పరిటాల కీలక అనుచరుడు.. చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్..

పరిటాల రవీంద్ర అనుచరుల్లో చాలా మంది ఆయన కోసం ప్రాణాలు త్యాగం చేశారు. మరి కొందరు ఆయన ఫ్యామిలీ భద్రత కోసం ఎప్పుడైనా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అంటూ ఉంటారు ఎన్నో లక్షల మంది రవి అభిమానులు ఆ కుటుంబం కోసం ఏమైనా చేయడానికి సిద్దపడతారు. రవి బతికి ఉన్నప్పుడు చమన్‌, పోతుల సురేష్‌ వంటి కీలకమైన అనుచరులే కాక చాలా మంది అజ్ఞాత మిత్రులు ఆయనకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు.

అటువంటి రవి అనుచరుల్లో ఒకరు ఇప్పుడు వైకాపాలో చేరతారని ప్రచారం సాగుతుంది. రాప్తాడు లో పరిటాల కుటుంబాన్ని ఓడించడమే తమ లక్ష్యమని దాని కోసం ఏమైనా చేస్తామని జగన్‌ ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. గత ఎన్నికల్లోనే తాము గెలవాల్సిందని కొద్ది తేడాతో ఓడిపోయామని ఈసారి మాత్రం 15వేలకు తగ్గకుండా మెజార్టీ సాధిస్తామని ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుతుర్తి బ్రదర్స్‌ మీడియా సమావేశాల్లో చెప్పారు . మెజార్టీ సంగతి తరువాత గెలుపు సంగతి చూడాలని జగన్‌ చెప్పడంతో ఇప్పుడు  రవి సన్నిహితుల్లో కొందరిని లోబరుచుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

వారిని తమ పార్టీలో చేర్చుకుని రవి కుటుంబాన్ని ఓడించాలని జగన్‌ ఎత్తులు వేస్తున్నాడట. దీని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని రవి సన్నిహితులు ఎవరు వస్తే వాళ్లను చేర్చుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారట. దీంతో తోపుతుర్తి బ్రదర్స్‌ రవి మనుషులపై కన్నేశారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రవి కి ఉన్న వేల మంది అనుచరుల్లో ఎవరో ఒకరు వైకాపాలో చేరితే పెద్దగా నష్టం చేకూరదు కానీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రవి మనుషులు ఇలాంటి పని చేస్తారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది వాస్తమని జిల్లాకు చెందిన కొందరు నాయకులు, మరి కొందరు రవి అభిమానులు చెబుతున్నారు. అయితే వైకాపాలో చేరే రవి మనిషి ఎవరు..? అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.