అనంత‌లో ప‌రిటాల రౌడీ రాజ్యం రంగంలోకి పోలీసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 16:57:45

అనంత‌లో ప‌రిటాల రౌడీ రాజ్యం రంగంలోకి పోలీసులు

అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ నాయ‌కులు అధికార బ‌లంతో దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా మంత్రి ప‌రిటాల సునిత వ‌ర్గీయులు ప్ర‌వ‌ర్త‌న రోజురోజుకు ఎక్కువ అవుతూనే ఉంది. అయితే గ‌తంలో వారి దౌర్జ‌న్యాల‌పై బాధితులు అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని పైసీపీ కార్య‌ర్త‌ల‌తో పాటు, ఇటు సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా వాపోతుతున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి ప‌రిటాల అనుచ‌రులు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు. క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన సయ్యద్ షాషా అనే వ్య‌క్తిని ప‌రిటాల అనుచ‌రులు కిడ్నాప్ చేసి మంత్రి స్వ‌గ్రామం అయిన వెంక‌టాపురంలో అత‌న్ని చిత్ర‌హింస‌లు పెట్టారు.
 
త‌మ‌కు నాలుగు కోట్లు ఇవ్వాల‌ని లేక‌పోతే చంపుతామ‌ని బెదించారు. ఇక ఆయ‌న బ్యాంక్ అకౌంట్ నుంచి సూమారు 30 ల‌క్ష‌లు తీసుకుని అత‌డిని వ‌దిలేశారు. దీంతో సయ్యద్ షాషా క‌ర్ణాట‌క పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి ప‌రిటాల అనుచ‌రులు త‌న‌ను కిడ్నాప్ చేసి త‌న వ‌ద్ద‌నుంచి అక్ర‌మంగా డ‌బ్బులు తీసుకున్నార‌ని పోలీసుల‌కు తెలిపారు. 
 
దీంతో అత‌ని ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయం ఇంకొక‌రికి జ‌రుగ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వ పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు భాస్కర్‌ నాయుడుతో సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న పోలీసుల‌ను కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.