చమన్ మృతి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 16:27:34

చమన్ మృతి

అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల ర‌వి ముఖ్య అనుచ‌రుడిగా చ‌మ‌న్ రాష్ట్రంలో అంద‌రికి ప‌రిచ‌యమైన వ్య‌క్తి...  ఇక తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత అనంత‌పురం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గా కూడా ఆయ‌న ప‌నిచేశారు.. ప‌రిటాల ఇంట పెళ్లిలో మూడు రోజులుగా అంద‌రితో న‌వ్వుతూ ఉన్న చ‌మ‌న్ ఈరోజు హఠాన్మ‌ర‌ణం చెందారు.. చమన్‌కుఈ రోజు ఉద‌యం  ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న సవేరా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 
 
అయితే పరిటాల రవి కుమార్తె వివాహ వేడుకల పర్యవేక్షణ కోసం గత మూడు రోజులుగా చమన్‌ వెంకటాపురంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఆయన అస్వస్తతకు గురైనట్టు సన్నిహితులు తెలిపారు. చమన్‌ మరణవార్త విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు....ఆస్పత్రిలో చమన్‌ చనిపోయారన్న వార్త విన్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. డాక్టర్లు వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు. ఇక చ‌మ‌న్ మ‌ర‌ణంతో జిల్లా తెలుగుదేశం నాయ‌కులు ఒక్క‌సారిగా షాక్ కు గురి అయ్యారు.. 
 
పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్‌.. రవి హత్య తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చమన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2014 నుంచి 2017 వరకు ఆయన అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు సంతాపం తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.