సంచ‌ల‌నం అనంత‌లో వ్య‌భిచారం మంత్రి కుమారుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-17 06:38:18

సంచ‌ల‌నం అనంత‌లో వ్య‌భిచారం మంత్రి కుమారుడు

అధికార తెలుగు దేశంపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర వ్యాప్తంగా స‌భ‌లను ఏర్పాటు చేసి వివాదాల్లో చిక్కు కుంటున్నారు. ఇక వీరు విమ‌ర్శ‌లు చేయ‌క‌పోతే వారి త‌న‌యులు స‌భా ముఖంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. గంత‌లో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎంపీ సీఎం ర‌మేష్ విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డప‌ స్టీల్ ప్లాంట్ ను డిమాండ్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సుమారు 11 రోజుల పాటు నిరాహార‌ దీక్ష చేసి సంచ‌ల‌నం సృష్టించారు.
 
ఇక ఇదే స‌భ‌లో టీడీపీకి చెందిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, ర‌మేష్ దీక్ష చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు సంఘీభావం తెలిపి స‌భాముఖంగా జేసీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ ఉన్నంత వ‌రకు రాష్ట్రానికి ఉక్కు రాదు తుక్కు రాద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే మ‌రోసారి ఏపీ మంత్రి ప‌రిటాల సునిత త‌న‌యుడు ప‌రిటాల శ్రీరామ్ ఈ రోజు స‌భా ముఖంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు అనంతపురం జిల్లాలో టీడీపీ ఎంపీలు ఏర్పాటు చేసిన నిర‌స‌న దీక్ష‌లో పాల్గొని ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, అనంత‌పురం జిల్లాలో రైతులు దీన‌స్థితికి చేరుకుంటున్నార‌ని, పంట‌లు స‌రిగ్గా పండ‌క న‌మ్ముకున్న భూముల‌ను వ‌దిలేసి ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్లిపోయార‌ని శ్రీరామ్ అన్నారు. ఇక మ‌రికొన్ని ప్రాంతాల్లో అయితే కుటుంబాన్ని పోషించుకోలేక త‌మ కూతుళ్ల‌ను ముంబై వ్య‌భిచారానికి అమ్మేస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లపై ప్ర‌తిప‌క్ష‌ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అధికారంలో ఉండి రైతుల గురించి ఇలా మాట్లాడ‌టం దారుణం అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రైతుల‌కు స‌రైన క్ర‌మంలో రుణమాఫీ చేయించి ఉంటే ఆడ‌బిడ్డ‌ల‌ను రైతులు ఇత‌ర ప్రాంతాల‌కు అమ్ముకోర‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అనంత‌పురం జిల్లాలో రైతులు త‌మ కూతుళ్ల‌ను అమ్ముకుంటున్నారు అంటే అది కేవ‌లం టీడీపీ నాయ‌కుల వ‌ల్లే అని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.
 
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు హయాం నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ జిల్లాలో క‌నీసం ఆడ‌బిడ్డ‌ల‌ను కూడా కాపాడుకోలేని ప‌రిస్థితికి అధికారులు వ‌చ్చార‌ని వాపోతున్నారు. ఇక మ‌రి కొంద‌రు అయితే  టీడీపీ త‌ర‌పున గెలిచి మంత్రి ప‌ద‌వుల‌ను స్వీక‌రిస్తున్న సునిత రైతుల‌కు ఏ విధంగా స‌హాయం చేస్తున్నారో ఆమె కుమారుడు చేసిన వ్యాఖ్య‌ల ద్వారా అర్థం అవుతోంద‌ని అంటున్నారు. చుద్దాం రైతుల‌పై చంద్ర‌బాబు నాయుడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.