మ‌రో వివాదంలో పరిటాల శ్రీరామ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 01:32:50

మ‌రో వివాదంలో పరిటాల శ్రీరామ్

చంద్ర‌బాబు సీఎంగా అధికారంలో ఉంటే ఫ్యాక్ష‌న్ అనేది  రాయ‌ల‌సీమ‌లో ఉండ‌దు అని, తెలుగ‌త‌మ్ముళ్లు చెబుతూ ఉంటారు.. అయితే వారానికి ఏదో వార్త‌తో తెలుగుత‌మ్ముళ్లే  రాయ‌ల‌సీమ‌ను హైలెట్ చేస్తున్నారు... పైగా అనంత అంటేనే బాబుకు కంచుకోట అంటారు. ఆ కంచుకోట‌లోనే క‌ళ్లుతిరిగే రేంజ్ లో ఫ్యాక్ష‌న్ మ‌ళ్లీ పురుడుపోసుకుంటోంది అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు.
 
ప‌రిటాల వార‌సుడిపై అనేక వార్త‌లు ఇప్పుడు అక్క‌డ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.. జిల్లాలో ఫ్యాక్ష‌న్ మ‌ర‌క‌లు త‌గ్గుతున్నా రాప్తాడులో అదే పందా కొన‌సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది... గ‌తంలో వైసీపీ నేత‌ను గ‌దిలోఉంచి న‌రికి చంపిన విష‌యం తెలిసిందే, దీనిపై ఎన్నో ఆందోళ‌న‌లు జ‌రిగాయి.. స‌ద‌రు ఎస్సైకి  స్ధాన‌చ‌ల‌నం కూడా క‌ల్పించ‌కుండా మంత్రి స‌హ‌క‌రించారు అని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి ఆ స‌మ‌యంలో.
 
ఇక తోపుదుర్తి వెంట ఉండే యాద‌వ్ ను హ‌త్య చేసేందుకు ఇటీవ‌ల ప్లాన్ వేశార‌ని, కాని ముందుగానే ఈ ప్లాన్  తెలియ‌డంతో ఇది భ‌గ్నం అయింది అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఇక ఈ హ‌త్య‌లకు- ఘ‌ట‌న‌ల‌కు  కార‌ణం ప‌రిటాల శ్రీరామ్ అని అంటున్నారు వైసీపీ ఇంచార్జ్ తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి. 
 
అయితే ఈ వివాదం స‌ర్దుమ‌ణ‌గ‌క ముందే మ‌రో వివాదం ప‌రిటాల శ్రీరామ్ కు చుట్టుకుంటోంది. ఈ సెగ్మెంట్లో ప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచ‌రుడుగా ఉన్న బోయ సూర్యం పై దాడి ఇప్పుడు క‌ల‌క‌లం రేపింది... దీనిపై రివ‌ర్స్ గా వైసీపీ నేత‌ల పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. 
 
దీనిపై నిజా నిజాల‌ను జ‌రిగిన వాస్త‌వాల‌ను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత న‌స‌న‌కోట బోయ‌సూర్యం జిల్లా ఎస్పీకి తెలియ‌చేశారు.. త‌న పై చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి దాడి  చేయ‌లేద‌ని వెల్ల‌డించారు.. ఈ నెల 7న త‌మ నాయ‌కుడు తోపుదుర్తి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో తాను పేరూరులో ప‌ర్య‌టించాను అని తెలిపారు...దీంతో ఆగ్ర‌హించిన మంత్రి కుమారుడు శ్రీరాం మాద‌పురం శంక‌ర్.. ప‌రంధామ‌యాద‌వ్.. కొత్త‌ప‌ల్లి శివ‌కుమార్ మా ఇంటికి వ‌చ్చార‌ని న‌న్ను బెదిరించార‌ని తెలియ‌చేశాడు సూర్యం.. 
 
త‌ర్వాత త‌న‌ని వెంకటాపురం తీసుకువెళ్లి చిత్ర‌హింస‌లు పెట్టారని... ఈ దాడిలో త‌న చెయ్యి విర‌గొట్టార‌ని తెలియ‌చేశారు, రామ‌గిరిలో ఎవరైనా వైసీపీ పేరు ఎత్తితే చంపుతామ‌ని బెదిరించార‌ని వివ‌రించారు.
 
త‌ర్వాత  దౌర్జన్యంగా రామగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అక్క‌డ సీఐ యుగంధర్, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సమక్షంలో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకొని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మీనుగ నాగరాజులపై కేసు నమోదు చేశారని బాధితుడు బోయసూర్యం వివరించారు...దీనిపై వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.. అధికార పార్టీ అండ‌దండ‌ల‌తో ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు అని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.