లోక్ స‌భ నిర‌వ‌ధిక వాయిదా కేంద్రం స‌క్సెస్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 15:15:49

లోక్ స‌భ నిర‌వ‌ధిక వాయిదా కేంద్రం స‌క్సెస్..?

కేంద్రం అనుకున్న‌దే జ‌రిగింది.. బీజేపీ అభిష్టం ప్ర‌కారం జ‌రిగింది.... దేశంలో ప‌లు పార్టీలు కేంద్రం పై అవిశ్వాసం ప్ర‌వేశ‌పెడితే ఆ అవిశ్వాసం చ‌ర్చ‌కు రాకుండా 12 రోజులు కేంద్రం త‌ప్పించుకుంది ఇక చివ‌రి రోజు ఏపీలో వైసీపీ తెలుగుదేశం అవిశ్వాసం పై నోటీసులు ఇచ్చినా దానిపై చ‌ర్చ‌ను చేయలేదు స‌భ‌.
 
ఈ అంశం చ‌ర్చ‌కు రాకుండానే లోక్ స‌భ వాయిదా ప‌డింది.. దీంతో దేశంలో పార్టీలు ప్ర‌తిప‌క్ష పార్టీలు అన్ని అధికార బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి కేంద్రం బ‌య‌ప‌డి వెన‌క్కి వెళ్లింది అని విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. స‌భ‌లో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కీలక ప్రకటన చేశారు. వెల్‌లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్‌.. అనూహ్యంగా సభను నిరవదికంగా వాయిదావేశారు.
 
అరుపుల మధ్యే జాతీయ గేయం..: రెండు విడదలుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను స్పీకర్‌ వివరిస్తున్న తరుణంలో.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. అయినాసరే, స్పీకర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు.
 
ఆ తర్వాత లోక్‌సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు లోక్‌ సభకు ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. మోత్తానికి ఏపీకి ప్ర‌త్యేక హూదా అంశం చ‌ర్చ‌కు రాలేదు.. అలాగే ప‌లు స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో చ‌ర్చిద్దాము అనుకున్న విప‌క్షం ఆలోచ‌న సాధ్యం కాలేదు...మొత్తానికి అనుకున్న విధంగా కేంద్రం స‌క్సెస్ అయింద‌ని విమ‌ర్శిస్తున్నారు అంద‌రూ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.