టీడీపీ ప్రొడ‌క్ష‌న్ వైసీపీ డైర‌క్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 15:09:16

టీడీపీ ప్రొడ‌క్ష‌న్ వైసీపీ డైర‌క్ష‌న్

ఎవ‌రు తీసుకున్న గోతిలో వారు ప‌డుతారు అని అలాగే ఉంది తెలుగుదేశం నాయ‌కుల ప‌ని... ఇంటి కూర పుల్ల‌న, ప‌క్క ఇంటి వాడి కూర కారం ఉప్పు చేదు సంధింగ్ స్పెష‌ల్ అని అలాగే ప‌క్క‌వాడి దాని కోసం పోటీ ప‌డ్డారు త‌మ్ముళ్లు....అలాగే వైసీపీ నాయ‌కులకు వ‌ల‌లు వేశారు.. కొంద‌రు పుల‌స‌ల్లా కాస్ట్ లీ రేటు ప‌లికినా, పార్టీలో చేర‌డానికి  కొన్నారు..
 
ఈ స‌మ‌యంలో యాగ  చేసిన  కొంద‌రికి ప‌ద‌వులు పెద్ద పెద్ద కుర్చీలు చూపించి పార్టీలోకి తీసుకున్నారు.. ఇక మొద‌టి పెళ్లాం ఉంటే రెండో పెళ్లాం వ‌చ్చి నా ప‌రిస్దితి ఏమిటి అన్న‌ట్టు?  మొద‌ట్లో బాగానే ఉన్నా కేడ‌ర్ అంతా సిట్టింగ్ ఎమ్మెల్యే వైపుకి వెళ్ల‌డం, ఫిరాయింపుల‌తో పొస‌గక తెలుగుదేశం నాయ‌కుల‌కు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు వార్ మ‌రింత ముదిరింది.... అంతా క‌లిసి అమ‌రావ‌తిలో పెద్ద పంచాయ‌తీ పెట్టేలా జ‌రుగుతోంది.
 
తెలుగుదేశం అంటే 2014 నుంచి ప‌లు వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్... ఫిరాయింపులు అంటే దేశంలో ఫ‌స్ట్ తెలుగుదేశం క‌నిపిస్తుంది.... దేశంలో ఏఏ స‌ర్వేలు రికార్డులు రివార్డులు వ‌చ్చినా మ‌న‌వాళ్లు ఆ లిస్టుల్లో ఉంటున్నారు.. బ‌హుశా ఆ విష‌యంలో అన్నింటా మేము ఉన్నాం అని త్వ‌ర‌లో చెప్పినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు.
 
రోజుకు 27 గంట‌లు ప‌నిచేస్తున్నాం అనేవారు ఒక‌రు అయితే 
వ‌ర్ధంతి జ‌యంతి అనేవారు మ‌రొక‌రు 
నీళ్లు లేని ఇబ్బంది ప్ర‌య‌త్న‌మే మా విశ్వ‌ప్ర‌య‌త్నం అని మ‌రొక‌రు
2800 రోజులు పాద‌యాత్ర చేశారు అని మ‌రొక‌రు
మ‌న పార్టీకి ఓటేస్తే ఉరి వేసుకున్న‌ట్లే అని మ‌రొక‌రు
జ‌గ‌న్ అందంగా ఉంటారు అని సంద‌ర్బం లేకుండా మాట్లాడే వారు ఒక‌రు
ఆడ‌వారికి ఎంత గౌర‌వం ఇస్తూ స‌భ‌ల్లో మాట్లాడ‌తారు స‌ద‌రు ఎమ్మెల్యేలు
కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరించే పీఏల‌తో ఎమ్మెల్యే మ‌రొక‌రు
 
ఇలా చెప్పుకుంటూ పోతే రామాయ‌ణ మ‌హాభార‌త ఇతిహాసాల పుస్త‌కాల‌ను కూడా దాటేస్తాయి  వీరి క్రీడ‌లు...అయితే  ఆళ్ల‌గ‌డ్డ పంచాయతీ చూసి ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక‌టే చ‌ర్చ,  22 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు గ‌తి ఉందా అనేది చ‌ర్చించుకుంటున్నారు... అయితే ఫిరాయింపు నాయ‌కులు కూడా  ఆ మ‌తి లేక ఆలోచ‌న‌లో ఉన్నారు అని అంటున్నారు... ఓ ప‌క్క జ‌గన్ పార్టీ త‌ర‌పున అన్ని గేట్లు గ‌ట్టిగా గోద్రేజ్ తాళాలు వేసి మూసేసాడు, ఏ ఫిరాయింపు నాయ‌కులు నా కాంపౌండ్ లోకి రావ‌ద్దు అని,  ఇక బీజేపీకి వెళ్లి సీటు తెచ్చుకుందాము అంటే అస‌లుకే మోసం జ‌నం త‌న్నుతారు.... అలాగే డిపాజిట్లు కూడా రావు... ఇక ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ‌దాం అంటే ఆయ‌న పార్టీ ఎక్క‌డ ఆయ‌న కేడ‌ర్ ఎక్క‌డ అనేది తెలుసుకోవ‌డానికే 24 గంట‌లు కూడా స‌రిపోదు.
 
ఇక ఈ స‌మ‌యంలో ఇండిపెండెంట్ గా అంటే మ‌నం చేసిన అభివృద్ది  ఏమీ లేదు అని సిట్టింగ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆలోచ‌న‌లో ఉన్నారు... ఇక ఇప్పుడు అమ‌రావ‌తిలో జ‌రిగిన ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ ఓ ట్రైల‌ర్ అద్బుత‌మైన టీజ‌ర్ మాత్ర‌మే... నిజ‌మైన సినిమా ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నిపిస్తుంది అంటున్నారు కొంద‌రు.... నెక్ట్స్ అంటే మాత్రం జ‌మ్మ‌ల‌మడుగు అంటున్నారు నాయ‌కులు,  ప్ర‌జ‌లు..  వాట్ అయామ్ సేయింగ్ ఈస్ క‌రెక్ట్ .
 
విశ్లేష‌ణ !! గణేష్. వి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.