గంటా బంధువు క్లారిటీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-09 12:46:49

గంటా బంధువు క్లారిటీ ?

మంత్రి గంటా శ్రీనివాస‌రావు అంటేనే రాజ‌కీయం గా ఉత్త‌రాంధ్రాలో ఆయ‌న‌కు  ఓ వ‌ర్గం ఉంటుంది అంటారు.. ఆయ‌న‌కంటూ స‌ప‌రేటు కేడ‌ర్ ఉంటుంది.. ప్ర‌జారాజ్యం- కాంగ్రెస్ -తెలుగుదేశం ఆయ‌న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వెనుకే ఉంటారు ఆయ‌న కేడ‌ర్.. ఆయ‌న బంధువు గంటా శ్రీనివాస‌రావుకు వెన్నంటి ఉండే నాయకుడు గంటా బంధువు పరుచూరి భాస్కరరావు వచ్చే ఎన్నికల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేయ‌నున్నారో తెలియచేశారు.
 
రానున్న ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి తీరుతానని మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు చెప్పారు. మండలంలోని బయ్యవరం ప్రమీలారాణితోటలో నియోజవర్గస్థాయి అనుచరులతో ఆయ‌న‌ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ టికెట్‌ వచ్చినా పోటీ చేస్తానని, ఒకవేళ ఏ పార్టీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 
 
అనకాపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి త్వరలో ‘పల్లెపల్లెకు పరుచూరి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. అన్ని గ్రామాల్లో పర్యటించడంతోపాటు రాత్రివేళ ‘పల్లె నిద్ర’ చేస్తానన్నారు.
 
1999లో గంటా శ్రీనివాసరావు ఎంపీగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం ప్రజలతో అనుబంధం ఉందని గుర్తుచేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలుపొందిన అన్ని నియోజకవర్గాలకు తాను ఇన్‌చార్జిగా పనిచేశానని చెప్పారు. నియోజకవర్గంలో తన అభిమానుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. మొత్తానికి గంటా వ‌ర్గం ఒక్క‌క్క‌రుగా ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల కోసం పావులు క‌దుపుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.