ఫ్యాక్ష‌న్ గ‌డ్డ వైసీపీకి అడ్డాగా మార‌నుందా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 14:09:04

ఫ్యాక్ష‌న్ గ‌డ్డ వైసీపీకి అడ్డాగా మార‌నుందా ?

రాష్ట్ర రాజ‌కీయాలన్ని ఒక ఎత్తు అయితే, రాయ‌ల‌సీమ రాజ‌కీయాలు మ‌రో ఎత్తు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. నాలుగు జిల్లాలు క‌లిగిన  ఈ ప్రాంతంలో గ్రామ స‌ర్పంచ్ నుంచి రాష్ట్ర‌ప‌తి  ప‌ద‌వి  వ‌ర‌కూ  అధిరోహించిన వారు ఉన్నారు. ఇది ఈ జిల్లాల ప్ర‌త్యేక‌త‌. ఇక ఈ నాలుగు జిల్లాల రాజ‌కీయాల్లోకి వ‌స్తే క‌ర్నూల్ జిల్లా రాజ‌కీయాలు  చాలా ఆస‌క్తి క‌రంగా ఉంటాయి... గ‌తంలో ఈ జిల్లా రాజ‌కీయం యావ‌త్ దేశాన్నే ఆశ్చ‌ర్యపరిచింది. నాటి నుంచి నేటి వ‌ర‌కూ రాజ‌కీయంగా అగ్ర‌స్థానాన్ని ద‌క్కించుకుంటోంది క‌ర్నూల్ జిల్లా.
 
ఇక ఈ జిల్లా విష‌యానికి వ‌స్తే 15 అసెంబ్లీ సీట్లు, రెండూ ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం మూడు అసెంబ్లీ సీట్లు మాత్ర‌మే తెలుగు దేశం పార్టీ కైవ‌సం చేసుకుంది. మిగిలిన సీట్ల‌న్ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక మెజారిటీతో గెలుచింది. దీంతో పాటు రెండు లోక్ స‌భ స్థానాల‌ను కూడా వైసీపీనే  కైవ‌సం చేసుకుంది. ఈ ఫ‌లితాలు చంద్ర‌బాబును సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా వెలువ‌డ్డాయి.
 
ఇక తాజాగా ఓ స‌ర్వే ద్వారా మ‌రికొన్ని విష‌యాలు వెల‌గులోకి వ‌చ్చాయి. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజక‌వ‌ర్గం ప‌త్తికొండ. అయితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ కంచుకోట కాస్తా బీట‌లు వాలే ప‌రిస్థితి ఎక్కువ‌గా ఉంద‌ని ఓ స‌ర్వేలో బ‌య‌టప‌డింది.1994 లో టీడీపీ త‌ర‌పున ఎస్.వీ సుబ్బారెడ్డి గెలిచిన‌ నాటి నుంచి నేటి ఉప‌ముఖ్య‌మంత్రి  కే.ఈ కృష్ణ మూర్తి ఎన్నిక  వ‌ర‌కూ ఇక్క‌డ ప‌రిపాలన పై  స‌ర్వే నిర్వ‌హించారు... అయితే ఈ స‌ర్వేలో ప‌లు కీల‌క విష‌యాలు ప‌ల్స్ సేక‌రించారు స‌ర్వే బృందం.
 
ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన‌ హామీల‌ను నెర‌వేర్చ‌డంలో నాయ‌కులు పూర్తి స్థాయిలో ఇక్క‌డ విఫ‌లం అయ్యార‌ని తేలింది... ఈ ప్రాంతంలో రైతులు ట‌మోటా పంట‌ను అధికంగా సాగుచేస్తారు. అయితే పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర కూడా ద‌క్క‌డం లేదు రైతుల‌కు. అయితే అధికారులు అదుకోవాల్సిన స‌మ‌యంలో చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఓటుతో స‌త్తా చాటేందుకు సిద్దమ‌య్యార‌ని ఈ స‌ర్వే తెలిపింది.
 
ప‌త్తికొండ సెగ్మెంట్లో 1,99,011 ఓట్లు ఉన్నాయి. మూడు సార్లు టీడీపీ త‌ర‌పున‌ ఎస్.వీ సుబ్బారెడ్డిని అసెంబ్లీకి పంపారు ఇక్క‌డ ప్ర‌జ‌లు. అలాగే. 2009 లో కే.ఈ  సోద‌రుడు ప్ర‌భాక‌ర్ ఎన్నిక అయ్యారు , 2014 లో కే.ఈ కృష్ణ మూర్తి ఇక్క‌డ ఎమ్మెల్యే అయ్యారు, రాయ‌ల‌సీమ త‌ర‌పున డిప్యూటీ సీఎంగా ఆయ‌న‌కు చంద్ర‌బాబు బాధ్య‌త‌ల‌ను  అప్ప‌గించారు. ప‌త్తికొండ‌లో ఇంత‌టి చ‌రిత్ర ఉన్న టీడీపీకి ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అత్య‌ధిక మెజారిటీతో వైసీపీ గెలుపొందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని ఈ స‌ర్వేలో తెలిపింది.
 
ముఖ్యంగా  ఇక్క‌డ  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 లో ఎన్నిక‌లు జ‌రగ‌డంతో, కాంగ్రెస్ దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. అయితే సీమ‌లోనే కాదు కోస్తాలో కూడా  ఎవ‌రికి రాన‌టువంటి ఓట్లు కాంగ్రెస్ త‌ర‌పున నిల‌బ‌డిని చెరుకుల పాడు నారాయ‌ణ రెడ్డికి వ‌చ్చాయి. ఆయ‌న త‌ర్వాత వైసీపీలో చేర‌డం ఇక్క‌డ బాధ్య‌త‌లు తీసుకుని పార్టీని గాడిలో పెట్ట‌డం జ‌రిగింది. అయితే ప్ర‌త్య‌ర్దులు ఆయ‌న్ని అత్యంత పాశ‌వికంగా చంప‌డంతో మ‌ళ్లీ రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ త‌గాదాల‌కు ఆజ్యం పోసిన‌ట్లు అయింది.
 
అయితే కే.ఈ కుమారుడు శ్యాంబాబు ఈ కేసులో నిందితుడు అని వారి ఆగ‌డాల‌ను అడ్డుకున్నందుకే త‌న భ‌ర్త‌ను చంపించారు అని ఆయ‌న భార్య, ప్ర‌స్తుత వైసీపీ ఇంచార్జ్ చెరుకుల పాడు శ్రీదేవి కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్క‌డ చెరుకులపాడు ఫ్యామిలీకి జ‌రిగిన విషాదం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇక్క‌డ కూడా శ్రీదేవికి ఎక్కువ‌గా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంది. ఇక ప‌త్తికొండ టీడీపీ నుంచి వైసీపికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార మార్పు ఇవ్వ‌డం ఖాయం అంటున్నారు స‌ర్వే ద్వారా విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.