ఎలుకను పట్టిన పవన్ ప్యాక్ట్ పైండింగ్ కమిటి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pavan kalyan image
Updated:  2018-03-04 12:09:12

ఎలుకను పట్టిన పవన్ ప్యాక్ట్ పైండింగ్ కమిటి

విబజన హమీల అమలు, ప్రత్యేక హోదా అమలులో జరుగుతున్న జాప్యం, 2018 కేంద్రపద్దు కూడా అయిపోవడంతో ఏపీలో ప్రజలు, పార్టీలు ఉద్యమబాట పట్టాయి. ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్....... అటు కేంద్రం చాలా చేశాము అనడం, ఇటు రాష్ట్రం చేయలేదు అనడం వలన ప్రజలు గందరగోళంలో ఉన్నారని ( వాస్త‌వానికి పవన్ రాజకీయ గందరగోళం తప్ప... ప్రజలకు ఏమీ లేదు) నిజా, నిజాలు ప్రజల ముందుకు తీసుకు వస్తామంటూ  ప్యాక్ట్ పైడింగ్ కమిటీ పేరుతో వామపక్షాలు, ఉండవల్లి, జయప్రకాష్, ఐ వై ఆర్ వంటి ప‌లువురి ముఖ్యుల‌తో క‌లిసి  కమిటి వేయడం...... వారు పరిశీలించిన నివేదికను....... వారి సమక్షంలో ప్రజలకు వివరణ ఇవ్వ‌డం జ‌రిగింది. అప్రధానమైన వారి కలయికలో సహజంగానే కొత్త విషయాలు లేకుండా వివరాలను ప్రజలముందుకు తీసుకువ‌చ్చారు. 
 
వారి మాటలనే పరిసీలి్స్తే...... 
1. పోలవరం నిర్మాణ బాధ్య‌త‌లు  రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకోవడం కార‌ణంగానే  నేడు కేంద్రాన్ని నిలదీసే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోవడమేకాక, వారు నిలదీసే పరిస్దితి వచ్చింద‌న్నారు. ఈ విషయం ఉండవల్లిగారితో సహ..... మా లాంటి వారు  తీసుకున్నరోజునుంచే చెపుతున్నాము. రూ.  52 వేల కోట్ల బడ్జెట్ కలిగిన పోల‌వ‌రం ప్రాజెక్టును 40 వేల కోట్లు కలిగి దేశంలోని 100 ప్రాజెక్టుల బాధ్య‌త ఉన్న నాబార్డు క్రిందకు ఇవ్వడమే ప్రమాదం. ఇక రాష్ట్రం తీసుకున్నా.... కేంద్రం తీసుకున్నా........ తేడా ఏమి ఉంటుంది. ఈ కీలక విషయం కమిటి గుర్తించకపోవడం విచిత్రమే. 
 
2. ఇక రాష్ట్రానికి హోదా ఇవ్వకపోయినా..... హోదా వలన వచ్చే ప్రయోజనం ఇస్తామని, అందులో భాగంగా కేంద్ర ప్రయోజిత ప్రాజెక్టులకు వచ్చే రాయితీల వాటాను రాష్ట్రానికి ఇస్తామన్నారని,  అది మొత్తం  రూ.16 వేల కోట్లు... ఇంకా ఇవ్వలేదని తెల్చారు.  నిజానికి ఏపి ముఖ్యమంత్రి ఇప్పటికి 100 సార్లు ఈ విషయం చెప్పారు. హోదా అంటే అదే కాదని ఇంకా చాలా ఉన్నాయని,  హోదాకు ఇది ప్రత్యామ్నాయం కాదని హోదా ఇచ్చి తీరాలని సెలవిచ్చారు. ప్రజలు కూడా చాలా రోజులుగా చేస్తున్న డిమాండు ఇదే కదా..!!
 
3. ప్యాకేజీ పాచిన లడ్డు అంటూ మరో విషయాన్ని కనుగొన్నారు. ఈ మేధావులు ప్యాకేజీని చదివారా..... లేదా...... అన్న అనుమానం వస్తుంది. ప్యాకేజీ అని కేంద్రం ప్రకటించింది. వాస్త‌వానికి అది ప్యాకేజీ కాదు.  2014 విభ‌జన చట్టంలోని కొన్ని అంశాలకు అవసరం అయ్యే ఖ‌ర్చును కూడి దానికి ప్యాకేజి అని ముద్దు పేరు పెట్టారు. బాధ్య‌తగల వ్యక్తులు చేయాల్సింది ఆ విషయాలను తప్ప.... అది వద్దు పాచిన లడ్డు అనడం బాధ్య‌తారాహిత్యం. 
 
ఏమున్నాయి ప్యాకేజీలో విశాఖ కేంద్రంగా HPCL విస్త‌రణ, పెట్రో కెమికల్ కాంప్లక్స్ కు రూ.52 వేల కోట్లు, ఉక్కు పరిశ్రమ విస్త‌రణకు రూ. 32 వేల కోట్లు, నేషనల్ ఇన్స్టూట్ ఆఫ్  పార్మాసిటికల్ కు రూ.20 వేల కోట్లు, కేంద్రీయ విద్యాసంస్దలకు రూ.12 వేల కోట్లు పోలవరానికి రూ.32 వేల కోట్లు, రాజధానిని కలుపుతూ జాతీయ రహదారులకు రూ.65 వేల కోట్లు ఇలా వీటిని  ప్యాకేజి అన్నారు. వాస్త‌వానికి ఇవి అమలులో ఉన్నాయి. ఇవ‌న్నీ  కొత్తగా ఇచ్చినవి  కావు..... చట్టంలో ఉన్నవే,  ఆ విషయం చెప్పకుండా పాచిన లడ్డు అనడం వారు చేసిన పరిశోధ‌నకు అద్దం పడుతుంది.
 
4. ఇక రెవిన్యూ లోటు వివిధ అంశాల‌కు జరుగుతున్న కేటాయింపులు సరిపోవని సెలవిచ్చినారు. కానీ ఆ విషయాలపైనే కదా రాష్ట్ర పార్టీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నది. మరి ఫ్యాక్ట్ పైడింగ్ కమిటీ ఏమి తెల్చినట్లు. విచిత్రం ఏంటంటే  చట్టంలో రైల్వేజోన్ రాష్ట్రానికి అని ఉంటే,  పార్టీలు తమ అవసరాల కోసం విశాఖకు రైల్వే జోన్  అని పేరు పెట్టాయి. పార్టీలకు ఏమాత్రం తీసిపోమంటూ విశాఖ రైల్వే జోన్ అని డిమాండు చేయడం వలన చట్టాన్ని ఏమి పరిశీలించినట్లు..... ఇక కీలకమైనది రాజధాని మౌళిక వసతులు కేంద్రం చేయాలంటా విభ‌జన చట్టంలో శివరామక్రిష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం సలహ ఇవ్వాలి.  తర్వాతనే రాష్ట్రం నిర్ణయం తీసుకోవాలి.  మరి చట్టాన్ని ఉల్లంఘించి అమరావతిని ఎంపిక ఎలా చేశారు అంటూ కమిటీ ఎందుకు  రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని  ప్రశ్నించలేదు ( కమిటీలో ఉన్నవారు అందురూ కోస్తా ప్రాంతానికి చెందిన వారు కాబట్టి అనుకోవాలా) కేంద్రం ఇవ్వాలి అన్నారు.... మరి ఇంతవరకు డిజైన్ లు కూడా పైనల్ కాలేదు. మరి కేంద్రం ఏ మేరకు ఎందుకు...... నిదులు ఇవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ ప్యాక్ట్ పైడింగ్ కమిటీ కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది అనడంలో  ఏ మాత్రం  సందేహం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.