ఫిరాయింపు ఎమ్మెల్యేతో ప‌వ‌న్ భేటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 06:37:59

ఫిరాయింపు ఎమ్మెల్యేతో ప‌వ‌న్ భేటీ

చలోరే చలోరే చల్‌ యాత్రలో భాగంగా క‌రువు యాత్ర పేరుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సోమవారంతో ప‌వ‌న్ మూడు రోజుల యాత్ర ముగియ‌నుంది. యాత్ర‌లో భాగంగా అనంత‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లువురు కీల‌క నేత‌ల‌ను క‌లుస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఆదివారం ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషాను కలిశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అత్తార్‌ చాంద్‌ బాషా అధికార టీడీపీ లోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే. అత్తార్‌ చాంద్‌ బాషా ఇంటికి వెళ్లిన పవన్‌.. ఆయనతో భేటీ అయి కాసేపు ముచ్చటించారు. అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే వీ ప్రభాకర్ చౌదరి కూడా పవన్‌ను మర్యాదపూర్వకంగా క‌లిశారు. మంత్రి ప‌రిటాల సునీత ఇంటికి కూడా ప‌వ‌న్ వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.