త్వరలో ప్రకటన చేస్తా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 10:38:54

త్వరలో ప్రకటన చేస్తా....

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్నారు. కరువు యాత్ర పేరుతో పర్యటిస్తున్న పవన్ అనూహ్యంగా పరిటాల ఇంటికి వెళ్లారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలను పవన్ కొట్టిపారేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే పవన్ ఇప్పుడు పరిటాల ఫ్యామిలీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీతను కలిసి రాయలసీమ సమస్యలపై కొద్ది సేపు చర్చించారు. ఆల్పాహారం విందు ఆనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.
దివంగత పరిటాల రవితో తనకు ఎలాంటి విబేధాలు లేవని మరోసారి చెప్పుకొచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు, సీమకు పొంచి ఉన్న ప్రమాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
అభివృద్దిని ఓకే చోట కేంద్రీకృతం చేయడం సరికాదని ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని అన్నారు. వెనుకబాటుకు గురైన సీమను అభివృద్ధి చేయకుంటే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు.
2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు.. శనివారం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవడంపై సర్వత్రా రాజకీయ చర్చ నెలకొంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.