జ‌గ‌న్ కు ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-26 12:01:22

జ‌గ‌న్ కు ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి

ప్ర‌తిపక్ష‌నేత‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భ‌గంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. 
 
తాను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పార్టీ స్థాపించ‌లేద‌ని, అలాగే ఏవ‌రిపైనా కూడా తాను వ్య‌క్తి గ‌తంగా విమ‌ర్శ‌లు చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి అయిన ఈ వివాదాల‌ను ఇక్క‌డితో అపెయ్యాల‌ని ప‌రోక్షంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విజ్ఞ‌ప్తి చేశారు ప‌వ‌న్. 
 
 
ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ ఏమ‌ని విజ్ఞ‌ప్తి చేశారు అంటే..
 
ఈ మ‌ధ్య‌న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు న‌న్ను వ్య‌క్తి గ‌తంగా విమ‌ర్శించిన తీరు చాలా మందికి భాద క‌లిగించింద‌ని అయితే అది నా దృష్టికి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. నేను ఎవ‌రి వ్య‌క్తి గ‌త‌మైన జీవితాల్లోకి వెళ్ల‌ను... అది రాజ‌కీయ ల‌బ్దీకోసం అస్స‌లు వాడ‌ను ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ప‌బ్లిక్  పాల‌సీ మీదే పోరాడుతున్నాన‌ని, కానీ మిగితా పార్టీ నాయ‌కుల‌తో వ్య‌క్తిగ‌త విభేదాలు లేవ‌ని పేర్కొన్నారు.
 
అయితే ఇదే సాకుతో ఈ వివాదంలో ఎవ్వ‌రు కూడా వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిని కానీ, వారికి సంబంధించిన కుటుంబం స‌భ్య‌లును కానీ, అలాగే వారి ఇంటి ఆడ‌ప‌డుచుల‌ను కానీ ఈ వివాదంలోకి లాగ‌వ‌ద్ద‌ని తాను మ‌స్పూర్తిగా అంద‌రిని  కోరుకుంటున్నాన‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ వివాదం ఇంత‌టితో ఆపెయ్యాల‌ని ప్ర‌తి ఒక్కరికి కోనుకున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.