రాజ‌ధాని రైతుల‌కు ప‌వన్ పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kalyan
Updated:  2018-10-30 10:42:22

రాజ‌ధాని రైతుల‌కు ప‌వన్ పిలుపు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా రాజ‌ధాని రైతులు పోరాటానికి సిద్దంగా ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. బ‌హుళ పంట‌లు పండె  భూముల‌ను అధికార తెలుగుదేశంపార్టీ నాయ‌కులు కొత్త భూముల సేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం రాజ‌ధానిలో 2400 ఎక‌రారాల‌ను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటుంద‌ని ఇందుకు వ్య‌తిరేకంగా పోరాటానికి రైతులంద‌రూ సిద్దంగా ఉండాల‌ని ప‌వ‌న్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు.
 
కొత్త భుసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం రాజ‌ధానిలో మ‌రో 2400 ఎక‌రాల‌ను సేక‌రించ‌డానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం రంగం సిద్దం చేసుకుంటోందంటు ఓ ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చిన ఆర్టిక‌ల్ పై ప‌వ‌న్ స్పందించారు. తెలుగుదేశం పార్టీ  ఉద్దేశపూర్వకంగానే రైతుల‌ను  త‌ర‌లించాల‌నుకుంటోందా.. అదే నిజ‌మైతే బ‌హుళ పంట‌లు పండే భూములు కాడుకోవ‌డానికి రైతులు పోరాటానికి సిద్దంకావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు.

షేర్ :