ప‌వ‌న్ కొంప‌లో అనుచ‌రుల కుంప‌టి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-22 18:14:20

ప‌వ‌న్ కొంప‌లో అనుచ‌రుల కుంప‌టి

దేశంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటుంది. సామాజిక వ‌ర్గాల వారీగా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు రాజకీయ‌పార్టీలు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు త‌మ పార్టీ కులాల‌కు అతీతంగా ప‌నిచేస్తుంద‌ని  చెప్పుకునే  అధినేత‌లే ముంద‌స్తు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ సొంత సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు రాజకీయ చద‌రంగంలో పావులు క‌దుపుతున్నారు. 
 
దేశంలో ఇత‌ర రాష్ట్రాల్లో సామాజిక వ‌ర్గాల సంగతెలా ఉన్నా..? ఏపీలో మాత్రం సామాజిక వ‌ర్గాల పునాదుల‌పైనే త‌మ పార్టీ నిల‌బడుతుంద‌నే విష‌యాన్ని ఘంటా ప‌థంగా చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌ల కోసం ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ర‌చ‌యిస్తున్నార‌నే ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. 
 
గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ - జ‌న‌సేన‌లు క‌లిసి ప‌నిచేశాయి. కానీ  ఇప్పుడు ప‌రిస్థితి మారింది. గ‌డిచిన కాలంలో అన్వేక కార‌ణాల వ‌ల్ల  ఎవ‌రికి వారు సొంత‌కుంప‌టి పెట్టుకున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోదిగి చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధ‌మయ్యారు.ఈ నేప‌థ్యంలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నిస్తుంటే , అధికారం లేక‌పోయినా ఎక్కువ సీట్లు గెలిస్తే చాల‌ని అంటోంది జ‌న‌సేన‌. మ‌రి అందుకు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర ఉన్న అస్త్రం ఏంటీ..?  ఇప్పుడు ఆ అస్త్ర‌మే ప‌వ‌న్ కాపాడ‌బోతుందా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిప్తోంది. 
 
జ‌న‌సేన ప్ర‌తిప్టాప‌న కార్యాక్ర‌మం నుంచి త‌మ‌పార్టీపై  కాపుల ముద్ర‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కొన్ని విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉన్నారు. అందుకే ముద్రగడ ఉద్యమం ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా కాపు రిజర్వేషన్ల అంశంపై ఆచితూచి మాట్లాడారు కానీ..మద్దతు పలకలేదు. ముద్రగడ కుటుంబాన్ని అరెస్టు చేసినప్పుడు కూడా నోరెత్తలేదు. 
 
మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ అలా కాదు. సామాజిక వ‌ర్గం కోసం పాటుప‌డుతున్నార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంటున్నారు. దీంతో ప‌వ‌న్ కూడా మిగిలిన పార్టీల లాగానే త‌మ‌పార్టీ అన్న సంకేతాల్ని బ‌లంగా వినిపిస్తు జ‌న‌సేన అంటే ప్ర‌జారాజ్యం పార్టీ - 2 అనేలా చేస్తున్నారు.కాపు సామాజిక వ‌ర్గంలో ఓటింగ్ శైలిని ప‌రిశీలిస్తే,  ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 74 స్థానాల్లో కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా కాపు కుల ఓటర్లే కావడం గమనార్హం. దాదాపు 18శాతం ఓటు బ్యాంకు ఈ సామాజిక వర్గానిదే.
 
మ‌రి అంత‌టి ట్రాక్ రికార్డ్ ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గాన్ని తృణ ప్రాయంగా వ‌దులుకుంటారా. ప‌వ‌న్ కూడా ఆ మాన‌వ త‌ప్పిదం చేయ‌కుండా సొంతవ‌ర్గానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా మొన్న విడుద‌ల చేసిన ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేరుస్తామ‌న్నారు.ఆ తరువాత రాజకీయ వ్యవహారాల కమిటీ నియామకం మరింతగా అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కమిటీలో కాపు సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీఠ‌ వేశారు.ఇందులో 85 శాతం మంది ఆ వర్గానికి చెందినవారు దీనికి మ‌రింత బలాన్ని చేకూరుస్తుంది. 
 
అలాంటి వారు పార్టీని బ‌లోపేతం చేయ‌కుండా, గ్రూపు రాజ‌కీయాల్ని ప్రొత్స‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా సొంత‌గ్రూపుల ఉనికి కోసం ఎవరికివారు సొంతకుంప‌టిల‌ను  ఏర్పర్చుకుంటున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచి క‌స‌ర‌త్తులు చేస్తున్న ప‌వ‌న్ రాష్ట్రంలో  విసృత ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అయితే ప‌ర్య‌ట‌న‌ల గురించి ప‌వ‌న్ ఎవ‌రికి చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ బ‌లం ఏంట‌నేది మీమాంస‌. అలా  ప‌వ‌న్ కూడా అంద‌రి  లాగానే తాను కూడా సామాజిక వ‌ర్గాల బ‌లోపేతంపై ఆధారా ప‌డాల్సి వ‌స్తుంది.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.