పవన్ చేతిలో మరో అస్త్రం..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-10-24 02:06:54

పవన్ చేతిలో మరో అస్త్రం..

రాజకీయాల్లో మన కార్యకలాపాలు ఇంటిఇంటికి చేరాలంటే కావాల్సింది కార్యకర్తల బలం తో పాటు, మీడియా బలం కూడా. అలాంటి బలం ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరొకటి తోడైంది.ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తీపికబురు లాంటిది.ఇప్పటికే ఓ తెలుగు పత్రిక - మరో జాతీయ ఛానల్ - ఓ ప్రాంతీయ ఛానల్ మద్దతుతో పవన్ దూసుకుపోతుండగా... ఇంకో టీవీ ఛానల్ త్వరలో యాడ్ కానుందనే వార్తలు వచ్చాయి.

పవన్ పార్టీకి మద్దతుగా మూడో టీవీ ఛానల్ గా సదరు చానల్ నిలవనుందని దీన్ని ఓ ఎన్నారై ప్రారంభించ న్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఈ దసరాకు టెస్ట్ సిగ్నల్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే మాజీ ఐఏఎస్ జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99 టీవీ ఛానల్ను పవన్ పార్టీకి మద్దతుగా ఉండేందుకు కొనుగోలు చేశారు. అలా జనసేనకు పరోక్షంగా ఓ మీడియా చానల్ వచ్చింది. ఇది జరిగిన కొద్దికాలానికి మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణ జనసేన కండువా కప్పుకున్నారు.

తద్వారా వారి చేతుల్లో ఆంధ్రప్రభ పత్రిక పవన్ కి మద్దతు గా వార్తలు ప్రచురిస్తుంది.ప్రైమ్9 న్యూస్ పేరుతో పవన్ పై ఉన్న అభిమానంతో ఓ ఎన్నారై తన దగ్గరున్న డబ్బుతో ఈ ఛానెల్ స్థాపించారు.ఇప్పటికే  దసరా నాడు టెస్ట్ సిగ్నల్ వచ్చిన ఈ ఛానల్ పవన్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమం కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. పవన్తో ప్రత్యేకంగా ఫోన్ ఇన్ ప్రోగ్రాం పెట్టనున్నట్లు చెప్తున్నారు. జనసేన కార్యకలాపాలు విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాల ఈ ప్రోగ్రాం ఉండబోతుంది అని అంచనా వేస్తున్నారు.

షేర్ :