ప‌వ‌న్ నోట వైసీపీకి మ‌ద్ద‌తు మాట‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 10:32:14

ప‌వ‌న్ నోట వైసీపీకి మ‌ద్ద‌తు మాట‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటనతో రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరువు యాత్ర పేరుతో పర్యటించిన పవన్ అక్కడ టీడీపీ నాయకులను కలవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీడీపీ నేతలతో చర్చిస్తే కరువు సీమ సమస్యలు పరిష్కారం కావని, స్ధానిక సీమ ఉద్యమకారులను కలిసి వారితో సమస్యలపై చర్చించి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే కాస్తో..కూస్తో ప్రయోజనం ఉంటుందనేది పలువురి అభిప్రాయం.

పవన్ అనంత పర్యటనలో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ అన్నారు. దీంతో పాటు టీడీపీ, బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో దేనికి మద్దతు ఇస్తానో తెలియదని కూడా ప్రస్తావించారు.

ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం, గత ఎన్నికల వేళ ప్రకటించిన హామీల విషయంలో టీడీపీ పై ప్రజల వ్యతిరేఖతతో పాటు, సీట్ల పంపకం వంటి వాటిలో ఏదైనా తేడా జరిగితే జనసేన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వక తప్పదా......ఇచ్చినా ఇవ్వకపోయిన చంద్రబాబుపై జగన్ పోరాటం మాత్రం ఆగదులేండి....

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.