నాడు అన్న నేడు తమ్ముడు డిష్యుం డిష్యుం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chiranjeevi and pawan kalyan
Updated:  2018-08-30 04:38:28

నాడు అన్న నేడు తమ్ముడు డిష్యుం డిష్యుం

త్వ‌ర‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఏపీలో  త్రిముఖ పోరు త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ , పీఆర్పీ, టీడీపీలు పోటీ చేశాయి. ఆ ఎన్నిక‌ల్లో పీఆర్పీ ఓట్ల‌ను చీల్చ‌డంతో కాంగ్రెస్ పార్టీ లాభ‌ప‌డింది. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో లాభ‌ప‌డే పార్టీ ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే నాడు పీఆర్పీ ఓట్ల‌ను చీల్చి కాంగ్రెస్ కు ఎలా ల‌బ్ధిచేకూర్చేలా చేసిందో..ఇప్పుడు జ‌న‌సేన పార్టీ కూడా అత‌ర‌హాలో ఓట్ల‌ను చీల్చి  ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధికి లాభిస్తున్న‌దే చ‌రిత్ర చెబుతున్న‌మాట‌.
 
ఈ నేప‌థ్యంలో 2009 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న చిరంజీవికి ప‌ట్టిన గ‌తే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా ప‌డుతుందా  అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ జ‌న‌సేన పార్టీలో మార్పులు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో  వైసీపీ - జ‌న‌సేన - టీడీపీల మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ అన్న‌ట్లు ఓటింగ్ జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన వ‌ల్ల ఓట్లు చీలే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఏ పార్టీ లాభం చేకూరుతుందా అనేది తెలియాల్సి ఉండ‌గా..గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌భావం చూపించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పార్టీ త‌న హ‌వా కొన‌సాగించ‌నున్న‌ట్లు స‌ర్వేలు చెబుతున్నాయి.
 
జ‌న‌సేన పార్టీలో కేడ‌ర్ లేదు. ఒక్క లీడ‌ర్ లేడు. అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌రే పార్టీని త‌న భుజ‌స్కందాల‌పై న‌డిపిస్తున్నారు. మ‌రి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నా ప‌వ‌న్ ఏమాత్రం కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే అనుమానాలు త‌లెత్తున్నాయి. దీనికి తోడు కొద్దిరోజుల్లో ప‌వ‌న్ పర్య‌ట‌న‌లు ప్రారంభించ‌నున్నారు. ఆ ప‌ర్య‌ట‌న‌ల్లో ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు ప‌వ‌న్ వెంట న‌డిచేలా  తెర‌వెనుక మంత్రాంగం నెరిపిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 
 
కొత్తపేట, రాజమహేంద్రవరం, పిఠాపురం, తుని ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతో పీఆర్పీలా..,జ‌న‌సేన కూడా ఇదే ప్రాంతాల్లో బ‌ల‌ప‌డే అవ‌కాశాలున్నాయిని జోరుగా విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. అందుకే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స‌మ‌ర్ధులైన నేత‌ల‌కోసమే అన్వేష‌ణ‌ ప్రారంంభించిన‌ట్లు తేట‌తెల్ల‌మైంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.