2019 ఎన్నిక‌ల‌కు మొద‌టి అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన.. ప‌వ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-09-12 12:45:48

2019 ఎన్నిక‌ల‌కు మొద‌టి అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన.. ప‌వ‌న్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్యే పోటీ కాకుండా జ‌న‌సేన పార్టీతో పోటీ జ‌రుగ‌నుంది. ప్ర‌ధాన పార్టీలు వ‌చ్చే ఎన్నికల్లో అధికారం కోసం పావులు క‌దుపుతుంటే జ‌న‌సేన పార్టీ మాత్రం ఈ రెండు పార్టీల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర చేస్తున్నారు. 
 
ఇప్ప‌టికే ఈ బ‌స్సు యాత్ర ఉద్య‌మాల పురిటి గ‌డ్డ ఉత్త‌రాధ్ర ఉభ‌యగోదావ‌రి జిల్లాల‌ను పూర్తి చేసుకున్నారు ప‌వ‌న్. ఒక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఇత‌ర పార్టీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాలు దృష్టిలో ఉంచుకుని ఇత‌ర‌ పార్టీల్లో చేరుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో పితాని బాల‌కృష్ణ కూడా ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఇక ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకున్న త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌బోయే మొద‌టి అభ్య‌ర్ధిని బాల‌కృష్ణ‌న‌నే ప్ర‌క‌టించారు ప‌వ‌న్.
 
తాజాగా ఇదే విష‌యాన్ని ఆయ‌న మీడియా ద్వారా వివ‌రించారు.  పితాని బాల‌కృష్ణ బ‌ల‌మైన అభ్యర్ధి అని అంతేకాదు ఆయ‌న కానిస్టేబుల్. మా తండ్రి కూడా కానిస్టేబుల్... నాన్న‌పై ప్రేమ‌తో ముమ్మిడి వ‌రం ను