పవన్ రాజకీయ యాత్ర ప్రకటన

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 11:24:03

పవన్ రాజకీయ యాత్ర ప్రకటన

2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత   ప‌వ‌న్   క‌ళ్యాన్ త‌న రాజ‌కీయ  కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. అయితే ఈ ప్ర‌క‌ట‌నకు సంబంధించి పూర్తి  క్లారిటీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీని స్ధాపించిన త‌ర్వాత ప్ర‌త్యక్షంగా ఇంతవ‌ర‌కు ఎన్నిక‌ల స‌మ‌రంలోకి  నేరుగా దిగ‌లేదు. 

2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో అందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను కూడా సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాజ‌కీయ యాత్ర చేప‌ట్టేందుకు సిద్ద‌మైన‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ ప్ర‌క‌ట‌న‌లో.... తెలంగాణాలోని కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం నుండి నిరంత‌ర  రాజ‌కీయ యాత్ర‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌కీయాల్లో జోక్యం  చేసుకున్న ప‌వ‌న్ ఇప్పుడు  మాత్రం త‌న యాత్ర‌ను తెలంగాణ‌లో ప్రారంభించ‌డం వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏమిటి.....అస‌లు ఎక్క‌డి నుండి ఎక్క‌డి వ‌ర‌కు యాత్ర కొన‌సాగించ‌నున్నారు....? ఏ విధ‌మైన యాత్ర చేయ‌నున్నారు........ ?ఎప్ప‌టి వ‌ర‌కు చేయ‌నున్నారు......? అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్నారు...? ఇలాంటి  ఎన్నో ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోసం జ‌న‌సేన శ్రేణుల‌తో పాటు ఇరు రాష్ట్రాల రాజ‌కీయ ఔత్సాకులు ఆస‌క్తిగా ఉన్నారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.