ప‌వ‌న్ పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 15:38:28

ప‌వ‌న్ పిలుపు

తెలుగుదేశం పార్టీలో మంత్రి నారాలోకేష్ ఎటువంటి ప్ర‌సంగం చేసినా ఆస్దాన మీడియాలతో పాటు, సోష‌ల్ మీడియా కూడా వెయ్యి క‌ళ్ల‌తో ప‌సిగ‌డుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి కామెంట్లు చేసినా అందులో ఉన్నా ప‌స‌ని - న‌స‌ని బ‌య‌ట‌పెడ‌తారు సోష‌ల్ మీడియా యూజ‌ర్స్..ఇక ట్రోలింగ్ లో ఆ  కామెంట్లు వేరు.
 
అయితే నా పెన్ష‌న్ తీసుకుని నాకు ఎందుకు ఓటు వేయ‌రు..
మేము వేసిన రోడ్ల‌పై తిరుగుతున్నారు..
నేను క‌ష్ట‌ప‌డుతున్నాను 27 గంట‌లు రోజుకు ప‌నిచేస్తున్నాను అని 
 
కామెంట్లు చేయ‌డంపైనే ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత 40 ఇయ‌ర్స్ అనుభ‌వం చెప్పే మాట‌లే ఇవి..ఇలాంటివి మంత్రి లోకేష్ కూడా చెబుతున్నారు...ఇక తెలుగుదేశం పార్టీలో మంత్రులు కూడా అదే విధ‌మైన కామెంట్లు చేస్తున్నారు.. ఇక తాజాగా మంత్రి నారాలోకేష్ పై ఇటు జ‌న‌సేన సైన్యం వైయ‌స్సార్ సీపీ సైన్యం ముందుకు వ‌స్తోంది.
 
మేమేసిన రోడ్ల మీద కవాతు చేస్తున్నారని లోకేష్ ఏవేవో మాట‌లు మాట్లాడారు.. కురుపాంలో రోడ్లు ఎక్కడున్నాయి. ఈ చుట్టుపక్కల 20గ్రామాల్లో రోడ్లు ఏక్కడ? ఏం లోకేష్ రోడ్లు చూస్తావా..? ఒక్కసారి రా నువ్వేసిన రోడ్ల మీద నడుద్దాం. రోడ్లు లేవని ఆర్టీసీ వాళ్లు బస్సులు తిప్పడం లేదు. చూస్తావా లోకేష్? రా.. వచ్చిచూడు అంటూ ప‌వ‌న్ ఆవేశంగా ఉత్త‌రాంధ్రా ప‌ర్య‌ట‌న‌లో అన్నారు. గిరిజ‌న యూనివ‌ర్శిటి గిరిజ‌నుల‌కు సంబంధించి ప్ర‌తిఫ‌లాలు వారికి అంద‌క‌పోవ‌డం స‌రైన సౌక‌ర్యాలు లేనితండాలు గిరిజ‌న ప్రాంతాలు చూపిస్తా అంటూ విరుచుకుప‌డ్డారు.
 
అయితే ఇక‌నైనా ఈ కామెంట్లు అధికార పార్టీ మానుకుంటే మంచిది అని ఇటు పార్టీలతో స‌హా ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.. మీ పాలు వ్యాపారం నుంచి రోడ్లు వేయ‌డం లేదు, మీ సొంత ఆస్తులు అమ్మి రోడ్లు వేయ‌డం లేదు, మా ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నులు నుంచి వేస్తున్న రోడ్లు, చేస్తున్న అభివృద్ది ప‌నులు అని ప్ర‌శ్నిస్తున్నారు. మా సొమ్ము మాకు ఖ‌ర్చుపెడుతూ మాపై విమ‌ర్శ‌లా అని ప్ర‌జ‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.. మ‌రి చూడాలి మంత్రిలోకేష్ ప‌వ‌న్ పిలుపుతో ఎటువైపు రోడ్లపై న‌డ‌వ‌డానికి వెళ‌తారో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.