ఏవ‌య్యా..ప‌వ‌న్ క‌ల్యాణ్..నువ్వేం హీరోవ‌య్యా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-09-05 04:59:53

ఏవ‌య్యా..ప‌వ‌న్ క‌ల్యాణ్..నువ్వేం హీరోవ‌య్యా..?

ఏవ‌య్యా..ప‌వ‌న్ క‌ల్యాణ్..నువ్వేం హీరోవ‌య్యా..? అని యాంటీ అభిమానులు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ అంటే పూన‌కం వ‌చ్చేలా ఊగిపోయ్యే అభిమానుల‌కోసం నువ్వేం చేస్తున్నావ్. `నేనూ సింహం లాంటోడిని. అది గెడ్డం గీసుకోదు నేను గీసుకొంటా. అంతే తేడా మిగ‌తాదంతా సేమ్ టూ సేమ్...అభిమానులే నాకు దేవుళ్లు అని భారీ డైలాగులు కొట్ట‌డం కాదు. అన్నా నీకోసం నేను ఏమీ చేయ‌లేక‌పోతున్నాన‌నంటూ మ‌నోవేద‌ను గురైన ఓ హార్డ్ కోర్ అభిమాని నా అన్నయ్య, నా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ అంటూ లేఖ రాసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.
 
అంతేకాదు ప్రాణం పోతుంద‌ని తెలిసినా ప‌వ‌న్ పై త‌న‌కున్న వెల‌క‌ట్టలేని ప్రేమ‌ని కురిపిస్తూ ఓ లేఖ రాశాడు. నా ఆత్మకు శాంతి చేకూరాలంటే నన్ను చూడటానికి పవన్ కళ్యాణ్ రావాలని, నా క‌ట్టెకాలుతుంటే  అతని చేతుల మీదుగానే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రాణాలొదిలాడు. మ‌రి అలాంటి త‌మ్ముడి కోసం అన్న  ప‌వ‌న్  ఏం చేశాడు..?  
 
జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే చాలు పూనకం వ‌చ్చేలా ఊగిపోయే అభిమానులున్నారు. ఆయ‌న సినిమా వ‌స్తుంటే గంట‌ల‌త‌ర‌బ‌డి క్యూలైన్లో నిలుచొని సినిమా చూసి చొక్కాలు చించుకునే వాళ్లు, బ‌ర్త్ డేల‌కు, జ‌న‌సేన పార్టీ ఫంక్ష‌న్ ల‌కు కోట్ల‌లో ఖ‌ర్చుచేసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారి కోసం ప‌వ‌న్ ఏం చేస్తున్నారు..? న‌ట‌న‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ప‌వ‌న్ రాజ‌కీయ‌రంగు పులుముకొని అభిమానుల్ని విస్మ‌రించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఓ సినిమాలో అభిమాని హీరో కోసం రైలుప‌ట్టాల‌పై ప‌డుకొని..శ‌రీరం చిద్ర‌మ‌వుతుంద‌ని తెలిసినా చివ‌రిసారిగా నేను చాలా పెద్ద త‌ప్పు చేశాను అన్నా. మానాన్న మా చెల్లెలి పెళ్లి కోసం దాచిన డ‌బ్బు పాడు చేశాన‌న్నా..! నాజీవితం నాశ‌నం అయ్యింది. ఆరోజు నుంచి ఆర్నెల్లుగా ఆస్ప‌త్రిలో ఉండి మా అమ్మ ఈరోజే చ‌చ్చిపోయింది. మా అమ్మ కాద‌న్న చ‌చ్చిపోవాల్సి నేనే అందుకే నేను కూడా మా అమ్మ‌ద‌గ్గ‌రికి వెళ్లిపోతాను. నీకు ఆల్ ది బెస్ట్ చెబుదాం అని ఫోన్ చేశాన‌న్న‌.నువ్వైనా 175 డేసే ఆడే సినిమా తియ్యాల‌న్న‌.ఇంక మా వ‌ల్ల కాద‌న్న.. సినిమాలు ఆడించ‌లేక చ‌చ్చిపోతున్నాం. హీరోలంటే మాకిష్టం అన్నా.వాళ్లంటే పిచ్చ‌న్నా పిచ్చి.మీరైనా మా హీరోతో హిట్ సినిమా తియ్యాల‌న్నా. ఆల్ ది బెస్ట్ అంటూ రైలు ప‌ట్టాల‌పై ప్రాణాలొదిలాడు. 
 
ఇలాంటి బ‌రువెక్కిచే అభిమానులు సినిమాలోనే కాదు నిజ‌జీవితంలోనూ ఉన్నారు  ప‌వ‌న్ కోసం, ఆయ‌న స్థాపించిన జ‌న‌సేన పార్టీ కోసం ఏం చేయ‌లేక‌పోతున్నాన‌నంటూ ఓ అభిమాని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డడం కంట‌త‌డిపెట్టిస్తోంది. విజయవాడ పెంజోన్ పేటలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ పవన్ కళ్యాన్ అంటే విపరీతమైన అభిమానం. జనసేన చేపట్టే అనేక కార్యక్రమాల్లో సైతం పాలుపంచుకునేవాడు.కానీ ఇటీవలి కాలంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు తాను ఏమీ చేయలేకపోతున్నానని బాధ పడేవాడు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పేవాడు. జనసేన కోసం ఏదో ఒకటి చేస్తానని చెబుతూ ఉండేవాడు.
 
నిన్న ఇంట్లో ఉన్న కుటుంబ‌స‌భ్యులంద‌రూ బయటకు వెళ్ల‌గా అనిల్ కుమార్  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా అభిమాన హీరో , నాఅన్నయ్య, నా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ అంటూ లేఖలో ప్రస్తావిస్తూ…నా ఆత్మకు శాంతి చేకూరాలంటే నన్ను చూడటానికి పవన్ కళ్యాణ్ రావాలని, క‌ట్టెకాలుతంఉటే అతని చేతుల మీదుగానే అంత్యక్రియలు నిర్వహించాలని లేఖలో కోరాడు.మ‌రి ప్రాణాలు తీసుకునేంత అభిమానుల్ని సొంతం చేసుకున్న ప‌వన్ ఏం చేశాడు. అభిమాని చివరి కోరికను తీర్చేందుకు పవన్ అంత సుముఖత చూపలేదు. స‌రికా ఈ సారి విజయవాడ వచ్చినప్పుడు.. కుటుంబసభ్యులను పరామర్శిస్తారని.. జనసేన నేతలు సర్దిచెప్పి… పని పూర్తి చేసారు.
 
దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై యాంటీ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. త‌న‌కోసం ప్రాణం పోతున్నా ప‌ట్టించుకోని ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.