టీడీపీకి ప‌వ‌న్ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 16:27:59

టీడీపీకి ప‌వ‌న్ చెక్

ఎన్నిక‌లు సమీపిస్తుండడంతో ఎవరు గెలుస్తారనే విష‌యంపై ప్రజల్లో తీవ్ర‌మైన‌ చర్చ కొనసాగుతుంది. తెలుగు దేశంపార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్తి కావడంతో విజయాలు, వైఫల్యాలు ఒక్కసారి పరిశీలిస్తే అసంపూర్తిగా ఉన్న రాజధాని, ఇసుకమాఫియా, భూకబ్జాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణామాఫీ, వీటన్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని టీడీపీపై ప్ర‌జ‌లు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు అధికార పార్టీ నాయ‌కులు ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్య‌త కూడా ప్రజలకు ఇవ్వ‌డంలేద‌ని ప‌లుచోట్ల మండిప‌డుతున్నారు.
 
ఇక 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఎక్కడ వైఫల్యాలు బయటపడతాయోనని ఆర్భాటంగా  నిరుద్యోగ భృతి ప్ర‌క‌టించేసింది. అయితే ఈ నిరుద్యోగ భృతికి కూడా ష‌రతుల‌ను విధిస్తూ అమలు చేస్తోంది. అంతేకాదు గ‌తంలో విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్రత్యేకహోదా వ‌ద్ద‌ని ప్రత్యేక ప్యాకేజి వ‌ల్లే రాష్ట్రానికి అనేక ఉప‌యోగాలు ఉన్నాయ‌ని చెప్పి ఇప్పుడు ఎన్నిక‌లకు వేళ‌య్యే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రెండు నాలుక‌ల ధోర‌ణిలాగా వ్యవ‌హ‌రిస్తూ ప్ర‌త్యేక హోదాకు జై కొడుతున్నారు. దీంతో అధికార పార్టీ నాయ‌కుల పై ప్రజల్లో  తీవ్ర అసంతృప్తి ఏర్ప‌డుతోంది. 
 
ఇక మ‌రోవైపు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అధికారంలో లేకున్నా కూడా నిత్యం ప్రజలలో ఉంటూ అధికారపార్టీ  వైఫల్యాలను ఎండగ‌డుతూ వ‌స్తున్నారు. వైసీపీ అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం   వరకు పాదయాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, అధికారపార్టీ  వైఫల్యాలను ప్రజలకు వివ‌రిస్తుండ‌టంతో జ‌గ‌న్ కు మ‌రికొంత ఆకర్షితులు అవుతున్నారు. 
 
ఇక 2014 సంవత్సరం లో కేవలం 1.5 శాతం ఓట్లు తేడాతో అధికారంలోకి రాలేక పోయింది క‌నుక  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ నాయ‌కులు పావులు క‌దుపుతున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఇక టీడీపీ నాయ‌కుల ప‌రిపాల‌న వల్ల ప్ర‌జ‌ల్లో కాస్త‌ అసంతృప్తి పెర‌గ‌డంతో  వైసీపీకి  కొంత మైలేజ్ పెరిగింది అనడంలో సందేహంలేదు .
 
ఇక జనసేనపార్టీ విషయానికి వస్తే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉండడంతో కొన్ని  చోట్ల సీట్లు  వచ్చినా అధికారంలోకి  మాత్రం రాడు. దీంతో ప‌వ‌న్ నిలకడలేని నాయ‌కుడ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తాను అని రాజకీయ పార్టీ పెట్టిన పవన్ ఆ విష‌యాన్నే మరిచిపోయి అధికారి పార్టీ తో నాలుగేళ్ల పాటు జతకట్టడంతో ప్రజల్లో కూడా పవన్ పట్ల అసంతృప్తి  నెలకొంది
 
ఆ త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ టీడీపీతో విడాకులు తీసుకుని ఒంటరిగా పోరాటయాత్ర పేరుతో ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక ఆయ‌న‌కు వస్తున్న ప్ర‌జా స్పందన చూసి అధికార పార్టీ నాయ‌కులు కంగుతింటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉత్తరాంధ్ర‌లో టీడీపీ మైలేజ్ బాగానే ఉన్నా ప‌వ‌న్ యాత్ర‌లో ఉన్న‌ది కూడా ఊడిపోయింది. మొత్తానికి ప‌వ‌న్ ఉత్తరాంధ్ర‌లో టీడీపీకి చెక్ పెట్టార‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.