వైసీపీ-జ‌న‌సేన‌ పొత్తుల‌పై ప‌వ‌న్ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and pawan
Updated:  2018-10-29 11:22:48

వైసీపీ-జ‌న‌సేన‌ పొత్తుల‌పై ప‌వ‌న్ క్లారిటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ ను గ‌ద్దె దించేందుకు అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసుకున్న‌ట్లు ఏపీలో కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును గ‌ద్దె దించేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన‌పార్టీల‌ మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు సీట్ల స‌ర్ధుబాటు కూడా అయింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రో వైపు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కూడా ఇదే విష‌యాన్ని అనేక సంద‌ర్భాల్లో మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. 
 
వైసీపీ, జ‌న‌సేన పొత్తులంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు, అయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారు ఎందుకు అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.
 
మ‌రో ట్వీట్ చేస్తూ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన, ఆ పార్టీ తో కలుస్తుంది, ఈ పార్టీ తో కలుస్తుంది అని కొందరు అంటే, కలవడం ఏంటి..? సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మాకు ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు, మన బలం జనం చూపిద్దాం ప్రభంజనం అంటూ ప‌వ‌న్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.