ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 15:37:41

ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో భాగంగా మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడుపై ప‌వన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ది అంటే భారతీయుల భూముల్ని లాక్కుని విదేశీయులకు అప్పగించడమా?లేక పేదల భూముల‌ను టీడీపీ నాయ‌కులు బ‌లవంతంగా లాక్కుని పెద్దలకు ధారాదత్తం చేయడమా?  లేక వేల కోట్లను విదేశీ కంపెనీలకు దోచి పెట్టడమా?  ఇదేనా చంద్రబాబు అభివృద్ది అని ప‌వ‌న్ ప్రశ్నించారు.
 
సొంత జిల్లాను అభివృద్ది చేయ‌లేని చంద్ర‌బాబు రాజ‌ధానిని ఎలా అభివృద్ది చేస్తార‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే అన్ని చోట్ల‌ టీడీపీ నాయ‌కులు అభివృద్ధి పేరు చెప్పి భూములు తీసుకొని రైతుల‌కు న‌ష్ట పరిహారం ఇచ్చారని అన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా అభివృద్ది పేరుతో ప్ర‌జ‌ల భూముల‌ను టీడీపీ నాయ‌కులు తీసుకున్నారని అయితే వారికి ఎలాంటి న‌ష్ట ప‌రిహారాన్ని చంద్ర‌బాబు అందించ‌లేద‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న చంద్ర‌బాబు ఒక్కొ ప్రాంతాన్ని ఒక్కొ విధంగా చూడ‌డం స‌రికాద‌ని ప‌వ‌న్ ఆరోపించారు.
 
2014 సార్వ‌త్రిక ఎన్నికల్లో జ‌న‌సేన, కాపు నేత‌ల మ‌ద్ద‌తుతో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు రాష్ట్రంలో ఏ ఒక్క‌రికి న్యాయం చేసింది లేద‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు. గ‌తంలో పేద‌ ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తార‌నే ఉద్దేశ్యంతోనే చంద్ర‌బాబుకు జ‌న‌సేన మ‌ద్ద‌తు తెలిపింద‌ని అన్నారు. త‌మ మ‌ద్ద‌తుతో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఒక్కొక్క‌రిని ఒక్కొ విధంగా చూస్తున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.