జ‌గ‌న్ కు బాబుకు ప‌వ‌న్ కొత్త పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:50:33

జ‌గ‌న్ కు బాబుకు ప‌వ‌న్ కొత్త పిలుపు

ఉత్త‌రాంధ్రా ప‌ర్య‌ట‌న‌లో  తెలుగుదేశం బూజు, దుమ్ము, డ‌స్ట్ ప‌ట్టింది అంతా దులిపేస్తున్నారు జ‌న‌సేనాని..ఇటు గ‌తంలో 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు న‌న్ను ప‌క్క‌న కూర్చొబెట్టుకుని స‌పోర్ట్ చెయ్య‌మ‌ని అడిగారు.. నేను నేనుగా వారి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు అని షాకింగ్ కామెంట్లు చేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్...అయితే జ‌న‌సేనాని ఉగ్ర‌రూపుడు అవ్వ‌డం తెలిసిందే ఆయ‌న చిన్న విష‌యానికి పెద్ద విష‌యానికి ఒకేలా రెస్పాండ్ అవుతాడు... ఇటు తెలుగుదేశం ఓ అవినీతి పార్టీ అని నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచేసింది అని విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు ఉత్త‌రాంధ్రా మ‌లివిడ‌త యాత్ర‌లో.
 
ఇంద్రుడు వ‌జ్రాయుధం అవ‌స‌రానికి వాడిన‌ట్లు వ‌ప‌న్ కూడా అస్త్రాలు ఉపయోగిస్తున్నాడు, ప‌వ‌న్ ఎన్నిక‌ల కోసం టీడీపీ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు అని అనే బ్యాచ్ రెడీ అయిపోయింది.. మ‌రో ప‌క్క ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల మందు అయినా ప‌వ‌న్ మేల్కొన్నాడు అని  ఇంకొంద‌రు స‌పోర్ట్ చేశారు...ఆనాడు స‌మైఖ్యాంద్రా ఉద్య‌మ స‌మ‌యంలో హైద‌రాబాద్ తో కూడిన తెలంగాణ మాకు కావాలి అంటే, తెలంగాణ ఏపీ విడిపోకూడ‌దు అనే స‌మైఖ్య‌వాదులు త‌యారు అయ్యారు..ఇప్పుడు కూడా ఏపీలో ఇలానే జ‌రుగుతోంది రాజ‌కీయం.
 
ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హూదా కావాలి అని అడుగుతుంటే, ఆవిష‌యం ప‌క్క‌న పెట్టి క‌డ‌ప ఉక్కును తెలుగుదేశం తెర‌పైకి తీసుకువ‌చ్చింది.. ఇటు ఉత్త‌రాంద్రా తెలుగుదేశం నాయ‌కులు అంద‌రూ క‌లిసి ఇటు రైల్వేజోన్ అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చి, అస‌లు ముచ్చ‌ట ఏపీకి ప్ర‌త్యేక హూదా ని మ‌ర్చిపోయారు... ఇవే రాజ‌కీయ నాయ‌కులు అవలంభించే తెలివితేటలు అనేది స్ప‌ష్టంగా తెలుస్తున్నాయి.
 
ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌గ‌న్ కు పిలుపు ఇచ్చారు, ఇటు ఆయ‌న పాత మిత్రుడు సీఎం చంద్ర‌బాబుకు పిలుపు ఇచ్చారు. రైల్వే జోన్ కోసం తాను పోరాడతానని, జగన్, చంద్రబాబు తనతో కలిసి వస్తారా? అని పవన్ ప్రశ్నించారు. ఇక్క‌డ త్రిముఖ పోరు జ‌రిగే ఎన్నిక‌ల కోసం జ‌నాలు ఎదురుచూస్తుంటే?  ఇప్పుడు ప‌వ‌న్ తిక‌మ‌క పెడుతున్నారు  జ‌న‌సైనికుల‌ను...ఇటు మోదీ ,రాహుల్ క‌లుస్తారా, మోడీ మ‌మ‌తా క‌లుస్తారా, కేసీఆర్ చంద్ర‌బాబు క‌లుస్తారా, నెవ‌ర్ ఇది జ‌ర‌గ‌దు.అయినా ప‌వ‌న్ పిలుపు ఇవ్వ‌డం జ‌న‌సేన‌కు కొత్త హుషారు తీసుకువ‌చ్చినా, ఇటు జ‌గ‌న్ టీడీపీ రెండూ క‌లిసి రావు.. ఎందుకంటే ఎవ‌రి స్ట్రాట‌జీలు వారివి, ఎవ‌రి రాజ‌కీయ పందాలు వారివి, ప‌వ‌న్   కొత్త‌గా ఆలోచిస్తే బెట‌ర్  అని సీనియ‌ర్ల సూచ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.