జ‌గ‌న్ కాదు ఇప్పుడు లోకేష్ టార్గెట్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy and nara lokesh image
Updated:  2018-03-15 18:24:23

జ‌గ‌న్ కాదు ఇప్పుడు లోకేష్ టార్గెట్..?

ఫార్టీ ఇయ‌ర్స్ ఎక్స్ పీరియ‌న్స్ ఇన్ పాలిటిక్స్ ...దేశంలో బ‌హుశా నా అంత అనుభవం ఉన్న రాజ‌కీయ నాయ‌క‌డు ఎవ‌రూ లేరు అని ప‌దే ప‌దే చెబూతూ ఉంటారు సీఎం చంద్ర‌బాబు.. అయితే న‌వీన్ ప‌ట్నాయక్-  జ్యోతిబ‌సు, క‌రుణానిధిని మ‌ర్చిపోతారు అల‌వాటే క‌దా అంటారు కొంద‌రు.
 
తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయ‌క‌త్వంలో ఉన్న టీడీపీ, ఇంత వ‌ర‌కూ ఏ ఎన్నిక‌ల్లో  కూడా ఒంట‌రిగా పోటీ  చేసి విజ‌యం సాధించిన దాఖ‌లాలు ఇప్ప‌టి వ‌ర‌కు లేవు. అయితే ఏదో ఒక పార్టీతో పోత్తు పెట్టుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డానికి టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, ప‌వ‌న‌ క‌ళ్యాణ్ అండ తీసుకున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. 
 
అయితే ప్ర‌స్తుతం సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తెలుగుదేశం పార్టీ అనేక ప్ర‌తికూల ప‌రిస్దితులు రాజ‌కీయంగా  ఎదుర్కుంటోంది.... ముఖ్యంగా విడిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాలుగు సంవ‌త్స‌రాల్లో ప్ర‌గ‌తి చూపించ‌లేక‌పోవ‌డం. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను, ప్ర‌త్యేక‌హోదాని  సాధించుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది అని చెప్ప‌వ‌చ్చు... ఇదే అంశంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో వైరం పెంచుకుని కేంద్ర మంత్రుల‌తో సైతం రాజీనామా చేయించింది టీడీపీ.... దీంతో కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న‌ టీడీపీతో అంటిముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది.
 
ఇక తాజాగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం  సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప‌లు కీల‌క వ్యాఖ్యలు చేశారు.. ప‌వ‌న్  మాట్లాడుతూ టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేష్‌,  తెలుగుదేశం ఎమ్మెల్యేలు  చేసిన అవినీతి పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.
 
దీంతో తెలుగు దేశం పార్టీకి చెందిన నాయ‌కులు ప‌వ‌న్ పై  విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. ఇవ‌న్ని ఒక వైపు వేధిస్తుంటే మ‌రో వైపు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ చేసిన అవినీతి పార్టీకి పెద్ద మైన‌స్‌గా మార‌బోతోంది. ఇలాంటి  ప‌రిణామాల మ‌ధ్య ఎవ్వ‌రి అండా లేకుండా  ఎన్నిక‌ల‌కు వెళితే చంద్రబాబు గట్టెక్కడం అంత సులువు కాద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.