పాడేరులో పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 18:08:30

పాడేరులో పోటీ

జ‌న‌సేన అధినేత రాజ‌కీయం చూస్తుంటే ప్ర‌జారాజ్యానికి జ‌న‌సేన‌కు సంబంధం లేదు అనేలా ముందుకు వెళుతోంది..రాజ‌కీయంగా నాలుగు సంవ‌త్స‌రాలు తెలుగుదేశానికి స‌పోర్ట్ చేసిన జ‌న‌సేనాని చివ‌రకు తెలుగుదేశంపై విమ‌ర్శ‌లు చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు.అయితే జ‌న‌సేన పార్టీ విధి విధానాలు అన్ని కార్య‌క‌ర్త‌ల‌కు కేడ‌ర్ కు మిన‌హా జ‌నానికి మాత్రం ఇంకా ఓ స్ప‌ష్టం రాలేదు..ఆస్ప‌ష్టత ఇచ్చే కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ లేరు అని చ‌ర్చించుకుంటున్నారు.
 
ఇటు ఉత్త‌రాంధ్రా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌నసేనాని త‌న పోటీపై ప‌దే ప‌దే క్లారిటీలు ఇస్తున్నారు.. అయితే ఓ చోట అయితే అనుకోవ‌చ్చు ప‌వ‌న్ మాత్రం ప‌లుచోట్ల తాను పోటీ అంటూ క్లారీటీ ఇస్తూ ముందుకు వెళుతున్నారు.175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్‌పోటీ చేస్తారా అనేలా సోష‌ల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్నాయి పోస్టులు.
 
గ‌తంలో రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న, అనంత‌పురం నుంచి పోటీ చేస్తా అని చెప్పారు.. త‌ర్వాత కొద్ది రోజుల‌కు ఉత్త‌రాంధ్రాలో పోటీ చేస్తాను అని అన్నారు. త‌ర్వాత ఆయ‌న కాకినాడ నుంచి లేదా భీమ‌వ‌రం నుంచి పోటీ చేస్తారు అని వార్త‌లు వినిపించాయి..ఇక తాజాగా పాడేరు నుంచి ఆయ‌న పోటీ చేస్తాను అని అన్నార‌ని ఇప్పుడు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.
 
ఇక ఇక్క‌డ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం అనేది ప‌వ‌న్ కు తెలియ‌దా అనే కొత్త ప్ర‌శ్న లేవ‌నెత్తుతున్నారు.. ముఖ్యంగా ఇక్క‌డ ఉన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన విష‌యం తెలిసిందే.. ఇక ఆమె కూడా ఆయ‌న పై ఫైర్ అయ్యారు..వేసవి విడిది కోసమే పవన్ అరకు వచ్చారని ఆమె సెటైర్లు వేశారు..ఏజెన్సీని అభివృద్ధి చేసింది సీఎం చంద్రబాబేనని ఆమె అన్నారు.. 
 
ఇక్క‌డ అభివృద్ది చంద్ర‌బాబుకు క‌నిపించ‌డం లేదా అని ఆమె ప్రశ్నించారు.. అయితే ప‌వ‌న్ ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే ఆమెకు ఓట‌మి ఖాయం అంటున్నారు జ‌న‌సేన అభిమానులు.. కాని ఇక్క‌డ ప‌వ‌న్ కు పోటీ చేసే ఛాన్స్ ఉందా రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు, స‌ల‌హాదారుల‌కే తెలియాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.