బంద్ కు ప‌వ‌న్ 48 గంట‌లు డెడ్ లైన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan image 3
Updated:  2018-03-16 12:59:19

బంద్ కు ప‌వ‌న్ 48 గంట‌లు డెడ్ లైన్

గుంటూరులో జరిగిన డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే బంద్‌కు పిలుపునిస్తానని, అవసరమైతే దీక్షకు దిగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు... .త‌న పై తెలుగుదేశం కుట్ర‌పూరిత కామెంట్లు చేస్తోంద‌ని అవి ప‌ట్టించుకోను అని అన్నారు.. తాను వైసీపీ తెలుగుదేశం బీజేపీ తొత్తుకాద‌ని నా వెనుక ఎవ‌రూ లేరు అని ప్ర‌జ‌ల‌తో క‌లిసి ముందుకు వెళుతున్నా అన్నారు  ప‌వ‌న్ క‌ల్యాణ్.
 
డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కల్యాణ్  పరామర్శించారు. ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. చనిపోయిన వారిని తీసుకురాలేం... దీనికి ఎవరు బాధ్యులు? అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది.. అని అన్నారు. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా? అంటూ ఇక్కడి ప్రజాప్రతినిధులకు సమస్యలు పట్టవా?  అని ప్ర‌శ్నించారు ప‌వ‌న్.
 
ప్ర‌త్యేక హూదా పై త‌న‌కు క్లారిటీ ఉంద‌ని మిగిలిన ఏ పార్టీకి క్లారిటీ లేదు అని ఆయ‌న విమ‌ర్శించారు.. ప్లీన‌రీలో తెలుగుదేశం పై కామెంట్లు చేయ‌డం తో ప‌వ‌న్ పై  తెలుగుదేశం నాయ‌కులు కౌంట‌ర్లు వేస్తూ మండిప‌డుతున్నారు. ఇక 48 గంట‌ల్లో స‌ర్కారు స్పందించ‌క‌పోతే బంద్ కు పిలుపు ఇస్తాన‌ని జ‌న‌సేనాని డెడ్ లైన్ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.