ప‌వ‌న్ కంటికి మ‌ళ్లీ గాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawankalyan
Updated:  2018-09-27 04:13:20

ప‌వ‌న్ కంటికి మ‌ళ్లీ గాయం

జ‌న‌సేన పార్టీ అధినేత న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులను టార్గెట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ బ‌స్సు యాత్ర ఉద్య‌మాల పురిటి గ‌డ్డ ఉత్త‌రాంధ్ర‌ను పూర్తిచేసుని ఆయ‌న సొంత జిల్లా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో బాగంగా ప‌వ‌న్ కంటికి మళ్లీ గాయం అయింది. 
 
ఇటీవ‌ల కొత కాలంపాటు కంటి స‌మ‌స్య‌తో ప‌వ‌న్ బాధ ప‌డుతున్న‌ స‌మ‌యంలో బ‌స్సు యాత్ర‌కు బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు ఆయ‌న ఎక్క‌డకు ప్ర‌యాణించినా కూడా న‌ల్ల‌ని క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌నిపించేవారు. ఆ త‌ర్వాత కంటినొప్పి ఎక్కువ కావ‌డంతో ఈ మ‌ధ్య‌కాలంలో ప‌వ‌న్ కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. ఆప‌రేష‌న్ చేయించుకున్న త‌ర్వాత కొద్దిరోజుల‌పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇక ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో త‌య యాత్ర మళ్లీ శురు చేశారు. 
 
తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌కవర్గంలో జ‌రిగి భారీ బ‌హిరంగ‌స‌భ‌లో తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భ‌క‌ర్ ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . ప‌వ‌న్ విమ‌ర్శ‌నాస్రాల క్ర‌మంలో అభిమానులు పెద్ద ఎత్తున పువ్వులు, ఎర్ర‌ని ట‌వ‌ళ్లు, పార్టీ జెండాల‌ను ఆయ‌న‌పై విసిరారు, ఈక్ర‌మంలో పార్టీ జెండాలు ట‌వ‌ల్స్ ప‌వ‌న్ కంటికి త‌గ‌ల‌డంతో మ‌ళ్లీ ఆయ‌న కంటికి గాయం అయింది. దీంతో ఆయ‌న‌కు కంటి డాక్ట‌ర్లు చికిత్స చెస్తున్నారు. చికిత్స చేసిన త‌ర్వాత మునుప‌టిలా బ‌స్సు యాత్ర‌కు బ్రేక్ ఇస్తారా లేక కంటిన్యూ చేస్తారా అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.