జ‌గన్ ను ఫిదా చేస్తున్న ప‌వ‌న్ అభిమానులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-25 18:14:10

జ‌గన్ ను ఫిదా చేస్తున్న ప‌వ‌న్ అభిమానులు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఒకప‌క్క ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంకల్ప‌యాత్రను చేప‌డుతూనే మ‌రోప‌క్క ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ తో వైసీపీపై ప్ర‌జ‌లు అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు స‌ర్వే చేయిస్తున్నారు. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావరి జిల్లా, అలాగే తూర్పు గోదావ‌రి జిల్లాలో 2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్  ఎక్కువ గా ఫోక‌స్ చేస్తున్నార‌ట‌. ఈ రెండు జిల్లాల్లో కాపు, క‌మ్మ కుల‌స్తులు ఎక్కువ‌గా ఉన్నారు. వీరు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎప్ప‌టినుంచో రాజ‌కీయ నాయ‌కులు భావిస్తారు. 
 
ఇందుకు ఉదాహ‌ర‌ణ 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లే అని చెప్పాలి. ఎందుకంటే తూగో, పాగో జిల్లాలో వైసీపీ ఘోర ప‌రాజ‌యాన్ని ఎదుర్కొంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యన్ని ఎదుర్కోవ‌డంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్వ‌ల్ప మెజారిటీతో అధికాంలోకి రాలేక పోయారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల్లో ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశ్యంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంల్ప‌యాత్ర‌ను స్పీడు పెంచారు.
 
ముఖ్యంగా జ‌గ‌న్ యువ‌త‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. విద్యా వ్య‌వ‌స్థ ఎక్కువ‌గా ఉన్న ఈ రెండు జిల్లాల్లో సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఇక జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా భ‌హిరంగ స‌భ‌లలో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను వివ‌రిస్తుంటే యూత్‌ మొత్తం ఫిదా అవుతున్నారు. ఒక‌ప్పుడు ఈ జిల్లాలో టీడీపీకి ఫేవ‌రెట్ గా ఉన్న సోష‌ల్ మీడియా ఇప్పుడు వైసీపీకి ఫేవ‌రెట్ అవుతున్నార‌ట‌. ఇందులో ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఏంటంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కూడా విప‌రీతంగా జ‌గ‌న్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ టీడీపీ నాయ‌కులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.