ప‌వ‌న్ బాధ‌ప‌డ్డారు టీడీపీ షెల్......

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan image
Updated:  2018-03-07 03:28:30

ప‌వ‌న్ బాధ‌ప‌డ్డారు టీడీపీ షెల్......

తెలుగుదేశం బీజేపీలు 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను రాజ‌కీయంగా వాడుకున్నాయి అనేది అంద‌రికి తెలిసిందే... అయితే  ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయంగా తెలుగుదేశాన్ని స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు.. అయితే తెలుగుదేశం ఎటువంటి క‌రివేపాకు రాజ‌కీయం చేస్తుందో సీనియ‌ర్లు వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. ఇక ప్ర‌త్యేక హూదా విష‌యంలో తెలుగుదేశం రెండు నాల్క‌ల ధోర‌ణి అవ‌లంభిస్తోంది అని విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.
 
తాజాగా జేఎఫ్ సీ క‌మిటీ వేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించారు..టీడీపీ-బీజేపీలు 2014 ఎన్నికల్లో తనను వాడుకుని వదిలేసినట్టుగానే తాను భావిస్తున్నానని అన్నారు ప‌వ‌న్.. ఇక రాజ‌కీయాల్లో తెలుగుదేశం   బీజేపీలు  తనను చిన్న పిల్లాడిలా చూస్తున్నట్టుగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు
 
తనపై ఐటీ అధికారులను కూడా ఉసిగొల్పారని పవన్‌ కల్యాణ్ చెప్పారు. బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి చిల్లరగా ప్రవర్తిస్తున్నారని ప‌వ‌న్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఇప్ప‌టికే ప‌లువురు ప‌వ‌న్ తెలుగుదేశం షెల్ లో ఉన్నారు అనేలా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్న విష‌యం తెలిసిందే.
 
ఇక కేంద్రంతో పోరాటానికి తెలుగుదేశం ఎందుకు ఆలోచిస్తోందో తెలియ‌డం లేదు అని, వైసీపీ తెలుగుదేశం రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం కేసుల‌కు భ‌య‌ప‌డి రాజ‌కీయాలు చేస్తున్నాయి అని విమ‌ర్శించారు ప‌వ‌న్... జ‌నాల మ‌ద్ద‌తు లేకుండా ఏపీలో ఉద్య‌మం న‌డుస్తోంద‌ని ఇలా కాకుండా తెలంగాణ ఉద్య‌మం గుజ్జ‌ర్లు ఉద్య‌మం ఎలా చేశారో అదే త‌ర‌హాలో ప్ర‌త్యేక హూదా ఉధ్య‌మం జ‌ర‌గాలి అని పిలుపునిచ్చారు ఆయ‌న‌... 
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పొలిటిక‌ల్ స్టాండ్ చెబుతా అని అన్నారు ప‌వ‌న్.. మూడో కూట‌మి అవ‌స‌రం ఉంది అని అన్నారు ప‌వ‌న్  క‌ల్యాణ్.దక్షిణాది ఉద్యమం తొండ ముదిరి ఊసరవెల్లిలా మారుతుందన్నారు. గుంటూరు సభలో తన కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ వెల్లడించారు.  మార్చి 14 సభలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు... జ‌న‌సేన ప్లీన‌రీలో జ‌న‌సేనాని ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేది తేల్చేస్తారు అప్ప‌టి వ‌ర‌కూ వెయిట్ చెయ్యాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.