అనుభవం శూన్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 18:43:14

అనుభవం శూన్యం

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ కేంద్రం పై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు పోరాటం చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం పై పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి అన్ని రాజ‌కీయ పార్టీలు. అవిశ్వాస తీర్మానాన్ని చ‌ర్చించ‌కుండానే పార్ల‌మెంట్‌ను ముగించింది కేంద్ర ప్ర‌భుత్వం. దీన్ని తిర‌స్క‌రించిన రాజ‌కీయ పార్టీలు వివిధ రూపాల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి.
 
ఏపీలో ఉన్న జ‌న‌సేన పార్టీ వామ‌ప‌క్షాల‌తో క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. విజ‌యవాడ బెంజ్ సర్కిల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు జ‌రిగిన పాద‌యాత్ర‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా మాట్లాడిన ప‌వ‌న్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆస్తులు తెలంగాణాకు, అప్పులు ఆంధ్రాకు కట్టబెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు.
 
రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి సుదీర్ఘ అనుభవం రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాలేదని అన్నారు. హక్కుగా  దక్కిన ప్ర‌త్యేక‌హోదాను సాధించడంలో పార్టీలు విఫలం చెందాయ‌ని అన్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం పాచిపోయిన లడ్డూలను ఇచ్చినా అవి చాలా ‌విలువైనవని చంద్రబాబు అన్నారు. . వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమ‌ర్శించారు. టీడీపీకి చిత్తశుద్ధి లేదుకాబట్టే అఖిల సంఘాల సమావేశానికి మేం వెళ్లలేదని పవన్ తెలిపారు. ప్ర‌త్యేక‌హోదా ఉద్యమంలో భాగంగా 15న అనంతపురంలో, 24న ఒంగోలులో, మే 6న విజయనగరంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ప‌వ‌న్‌ వివరించారు.

షేర్ :

Comments

1 Comment

  1. YOU R ALSO 4 YEARS TRAVEL FOR WITH TDP . WHY R SLEEPING 4 YEARS. U JUST WAKE UP. PLS ANSWER .

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.