రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 15:38:07

రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు...

ఈ మధ్యకాలంలో చంద్ర‌బాబుపైన, లోకేష్ పైన ఘాటుగా విమర్శలు చేస్తూ, అప్పుడప్పుడు టీడీపీ చేసిన అవినీతిపైనా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అందులో భాగంగానే లోకేష్ కి చెన్నైకి చెందిన శేఖర్ తో సంబంధాలు ఉన్నాయని, శేఖర్ రెడ్డి మార్చిన డబ్బు చంద్రబాబుదేనని ఆరోపించారు పవన్ కళ్యాణ్. పట్టిసీమలో జరిగిన అవినీతిపైనా, పోలవరంలో జరుగుతున్న అవినీతిలో చంద్రబాబుకు, లోకేష్ కి భాగం ఉందని ఆరోపించారు..
 
కాలినడకన తిరుమలకి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరులో రహదారి నిర్మాణ బాధితులకు చంద్రబాబు చేస్తున్నమోసంపై ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాధితులకి నష్టపరిహారం చెల్లించకుండా రోడ్ల విస్తరణ ఎలా చేస్తారని మండిపడ్డారు. వాళ్ళ కడుపుకోత వచ్చే ఎన్నికలలో మీకు శాపంగా మారుతుందని అన్నారు పవన్.
 
రహదారి బాధితులకు న్యాయం చేయకపోతే జనసేన ఊరుకోదని, చంద్రబాబు పాలనతో అన్ని వర్గాలవారు విరక్తిచెందారని అన్నారు జనసేనాని. చంద్రబాబు సొంత జిల్లాకే న్యాయం చేయకపోతే, రాష్ట్రానికి న్యాయం ఎలా చేస్తాడని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఆయన.టీడీపీ అధికారంలోకి రావడానికి మా వంతు సాయం మేము చేస్తే రాష్ట్రాన్ని చిన్నా బిన్నం చేస్తున్నారని బాబు పై విమర్శలు చేశారు జనసేన అధినేత.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.