ప‌వ‌న్ చుర‌క‌లు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan press meet
Updated:  2018-03-26 04:04:58

ప‌వ‌న్ చుర‌క‌లు ?

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబు పై, అలాగే  సీఎం త‌న‌యుడు మంత్రి నారాలోకేష్ పై ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ  ప్లీన‌రీలో ప‌వ‌న్  క‌ల్యాణ్ తీవ్ర‌స్దాయిలో విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.. ఇక బాబు ఆయ‌న కోట‌రీ మంత్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు... ఎటువంటి పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ చేయాలి అన్నా ప‌వ‌న్ ను ముందు ఉంచిన బాబు నేరుగా ప‌వ‌న్ వారికి ఎదురుతిరిగే స‌రికి ఎటువంటి యాక్ష‌న్ తీసుకోలేక ఉండిపోయారు... దీనిపై మంత్రి లోకేష్ కూడా స‌భ‌లో తాను ఎటువంటి అప‌కీర్తి మా కుటుంబానికి తీసుకురావ‌డం లేదు అన్నారు.
 
అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బీజేపీ ముందు ఉంచి రాజ‌కీయం చేస్తోంది అనే విమ‌ర్శ‌లు తెలుగుదేశం చేస్తూనే ఉంది.. కాని ఇప్పుడు బీజేపీ నాయ‌కులు కూడా ప‌వ‌న్ కు మాకు వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఎటువంటి సంబంధం లేదు అని చెబుతున్నారు.. అయితే తాజాగా వామ‌ప‌క్ష నేత‌ల‌తో ప‌వ‌న్ భేటీ అయ్యారు.. ఈ స‌మ‌యంలో ఆయ‌న తెలుగుదేశం స‌ర్కారును మ‌రోసారి తూర్పార‌బ‌ట్టారు.
 
ఏపీ రాజ‌ధాని ప్రాంతం తెలుగుదేశానికి ఆయా నాయ‌కుల‌కు మాత్ర‌మే రాజ‌ధానిగా ఉంది కాని ప్ర‌జ‌ల‌కు ఏపీ జ‌నాల‌కు రాజ‌ధానిగా లేదు అని చుర‌క అంటించారు. ఉత్త‌రాంధ్రా రాయ‌ల‌సీమ వారు ఇక్క‌డ ఎటువంటి స్ధిరనివాసం ఏర్ప‌ర‌చుకునే అవ‌కాశం లేదు అని ఆయన ప్ర‌శ్నించారు.. రాయ‌ల‌సీమ ఉత్త‌రాంధ్రావారు అమ‌రావ‌తిలో స్ధిర‌ప‌డే అవ‌కాశం ఉందా అని ఆయ‌న నిల‌దీశారు.
 
అమ‌రావ‌తి కొంత మందికి మాత్ర‌మే క్యాపిటల్ అని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్... రాష్ట్ర హ‌క్కుల విష‌యంలో ప్ర‌తీసారి తెలుగుదేశం కాంప్ర‌మైజ్ అయింది అని విమ‌ర్శించారు... విభ‌జ‌న హామీలు అందుకే నెర‌వేర‌లేదు అని తెలియ‌చేశారు.. ఏపీకి నిధులు లేవు అని చెబుతున్న  తెలుగుదేశం స‌ర్కారు ఎందుకు పుష్క‌రాల‌కు  వేల కోట్ల రూపాయ‌లు దుర్వినియొగం చేసింది  అని ఆయ‌న ప్ర‌శ్నించారు...ఉత్త‌రాంధ్రాలో వెయ్యి మందిలో 50 మంది చిన్నారులు స‌మ‌స్య‌ల‌తో  చ‌నిపోతున్నారు ఇలాంటి వాటికి స‌ర్కారు  ఎందుకు ఖ‌ర్చుపెట్ట‌దు అని ప్ర‌శ్నించారు..  నేను అడిగినా   ప్ర‌భుత్వం నుంచి స‌రైన స్పంద‌న‌ స‌మాధానం రాలేద‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.