జ‌గ‌న్ ని కాపీ కొడుతున్న ప‌వ‌న్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 14:08:16

జ‌గ‌న్ ని కాపీ కొడుతున్న ప‌వ‌న్ ?

రాజ‌కీయాల్లో ఒక‌రి క్రెడిట్ మ‌రొక‌రు పొంద‌డం ష‌రామాములే.. పార్టీలో ఇంట‌ర్న‌ల్ లీకుల‌తో అనేక మంది క్రెడిట్లు కొట్టిన సంద‌ర్బాలు ఉన్నాయి.. అయితే తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు మొద‌టి నుంచి జ‌గ‌న్ ఎన్ని అంశాల‌పై  ప్ర‌శ్నిస్తున్నా ఆపార్టీలో వెంట‌నే చల‌నం రాక‌పోయినా, కాస్త లేటైనా చ‌లిస్తోంది. అయితే ఇప్పుడు వైసీపీ  చేసే పోరాటాలు దీక్ష‌లు ప‌వ‌న్ కూడా చేస్తూ జ‌గ‌న్ ని ఫాలో అవుతున్నారు అని కొద్దికాలంగా ట్రోల్ న‌డుస్తోంది. ఉద్దాణంలోనే ఇంకా ప‌వ‌న్ అక్క‌డే ఉన్నారు అని, రాష్ట్ర స్ధాయి నేత కావ‌డంలేద‌ని కొంద‌రి విమ‌ర్శ‌..నిజ‌మే మేజ‌ర్ ప్రాబ్లం అధికారంలో ఉన్న అధికార పార్టీ ఆ విష‌యంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది.ఇవ‌న్నీ పార్టీకి మ‌రింత మైన‌స్ అని తెలిసినా ఆ క్రెడిట్ అంతా ప‌వ‌న్ కు ద‌క్కుతుందని మౌనం వ‌హిస్తోంది అధికార పార్టీ.
 
అయితే ప‌వ‌న్ ఉత్త‌రాంధ్రా ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌ల్లో బిజీగా ఉన్నారు ఇక్క‌డ జ‌గ‌న్ ని ఫాలో అవుతున్నార‌ట ప‌వ‌న్‌.. ఇక జ‌గన్ ఇటీవ‌ల చేప్పే ప్ర‌సంగాల స్టైల్ మారింది.. క‌థ‌ల రూపంలో  ఇప్పుడు స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ తెలియ‌చేస్తున్నారు జ‌గ‌న్‌. అయితే ఇటీవ‌ల మంచినీటి ని చూపించి ఇది చెర‌కు ర‌సంకాదు తాగేనీరు అని జ‌గ‌న్ మీడియా ముఖంగా అశేష జ‌న‌వాహిని మ‌ధ్య చంద్ర‌బాబు చూడండి అని చూపిస్తే అదే సీన్ జ‌న‌సేన అధినేత రిపీట్‌చేశారు.. దీంతో కొంద‌రూ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..
 
ఇక జ‌గ‌న్ ఎటువంటి స‌మ‌స్య లేవ‌నెత్తినా అదే స‌మ‌స్య‌ను లేవ‌నెత్తుతున్నారు... దీనిని ఆస్ధాన‌మీడియాలు, భ‌జ‌న బృందాలు. గుర్తుచెయ్య‌క‌పోయినా, వైసీపీ సోష‌ల్ మీడియా గుర్తిస్తోంది అలాగే వైర‌ల్ చేస్తోంది... ఇక జ‌న‌సేన వ‌ల్లే అభిమానులు వ‌ల్ల భ‌య‌ప‌డి నిరుద్యోగ భృతి ప్ర‌క‌టించార‌ట చంద్ర‌బాబు..ఇది కాస్త ఆలోచించాల్సిందే.
 
అస‌లు నిరుద్యోగ భృతి పైప‌వ‌న్ ఈ నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో ఎక్క‌డా మాట్లాడ‌లేదు..అలాగే నిరుద్యోగ భృతి పై ఎక్క‌డా చ‌ర్చ చేయ‌లేదు.. మ‌రి ప‌వ‌న్ ఎలా అంటారు అని ఇటు కొంద‌రు విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఇంకా జ‌గ‌న్ ప్ర‌తీ యువ‌త‌కు 90 వేల రూపాయ‌లు చంద్ర‌బాబు అప్పు ఉన్నారు అంటూ గొంతెత్తి ప్ర‌శ్నించేవారు..పాద‌యాత్ర‌లో నిరుద్యోగ భృతిపై రోజూ ప్ర‌శ్నించేవారు ఇలా జ‌గ‌న్ కూడా చెప్పుకోలేదు నా వ‌ల్లే నిరుద్యోగ భృతి బాబు ఇస్తున్నాడు అని వైసీపీ కౌంట‌ర్ ఇస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.