జ‌న‌సేన మేనిఫెస్టో ఇదే 12 అంశాలు కీల‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-14 17:10:51

జ‌న‌సేన మేనిఫెస్టో ఇదే 12 అంశాలు కీల‌కం

జ‌నసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి మ‌రింత బ‌లం చేకుర్చేందుకు కొద్ది కాలంగా పోరాట యాత్ర పేరుతో ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే . ఈ పోరాట యాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ఈ యాత్ర‌ను ముందుకు సాగిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ పోరాటయాత్ర ఉద్య‌మాల పురిటి గ‌డ్డ శ్రీకాకుళం జిల్లా అలాగే విశాఖ జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావరి జిల్లా భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతుంది. 
 
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ పార్టీ త‌ర‌పున మేనిఫెస్టో విజ‌న్ డాక్యుమెంట్ ను విడుద‌ల చేశారు. ఈ డాక్యుమెంట్ లో 12 అంశాల‌ను ప్ర‌ధానంగా పేర్కొన్నారు. అందులో.. మొద‌టిగా ప్ర‌తి మ‌హిళ ఖాతాలో 2500 నుంచి 3500 వ‌ర‌కు జ‌మ‌. రెండ‌వ‌ది మ‌హిళ‌లకు చ‌ట్ట స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్ప‌న‌, బీసీల‌కు మ‌రో అయిదు శాతం రిజ‌ర్వేష‌న్లు పెంచే ఆలోచ‌న‌, అలాగే కాపుల‌కు 9వ షెడ్యూల్ కింద రిజ‌ర్వేష‌న్లు, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీబీఎస్ సిల‌బ‌స్ ర‌ద్దు, ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ‌కు సామ‌ర‌స్యం, ముస్లింల అభివృద్దికి స‌చార్ విధానం.
 
మహిళ‌ల‌కు ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్, అలాగే అగ్ర వ‌ర్ణ పేద కులాల విద్యార్ధుల‌కు వ‌స‌తి గృహాలు, అగ్ర‌వ‌ర్ణాల్లో పేద‌ల అభివృద్ది కార్పోరేషన్ ఏర్పాటు... వీట‌న్నింటిని 2019లో జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment