ప‌వ‌న్-జేపీ భేటీ హైలెట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 05:08:52

ప‌వ‌న్-జేపీ భేటీ హైలెట్స్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురువారం లోక్ స‌త్తా వ్య‌వ‌స్థాప‌కులు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ ను క‌లిశారు. సుమారు  గంట‌కు పైగా భేటీ తర్వాత   వీరిద్ద‌రూ  మీడియాతో మాట్లాడారు. విభ‌జ‌న హామీల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విస్మ‌రించిన నేప‌థ్యంలో వాటిని సాధించే దిశ‌గా పోరాటం చేసేందుకు  జేఏసీ  ఏర్పాటు చేయాల‌నుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు  మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు జేపీ ప్ర‌క‌టించారు. 
 
సంతోషంగా సినిమాలు చేసుకుంటూ ఉండాల్సిన.. ప‌వ‌న్ క‌ష్టాల‌ను కోరి తెచ్చుకుంటున్నార‌ని జేపీ అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మాజానికి సేవ చేయాల‌న్న త‌ప‌న ప‌వ‌న్ లో ఉంద‌ని జేపీ  అన్నారు.  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు రావాల్సిన వాటిని సాధించుకునేందుకు చేస్తున్న ఈ పోరాటానికి త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని తెలిపారు. ఏదీ  ఒక్క రోజులో  సాధించ‌లేమ‌ని .....సాధించేంత వ‌ర‌కు పోరాడ‌దామ‌ని జేపీ అన్నారు. 
 
ఇక జేఏసీ ఏర్పాటు దిశ‌గా మిగ‌తా పెద్ద‌ల‌ను కూడా క‌ల‌వ‌నున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. పార్ల‌మెంట్ లో హామీ ఇచ్చిన విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను సాధించ‌డ‌మే జేఏసీ అంతిమ ల‌క్ష్యం అని,  ఇందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలియ‌దు.....మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని ప‌వన్ ప్రెస్ మీట్ ను ముగించేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.