గుంటూరులో ప‌వ‌న్ నివాసం అస‌లు కార‌ణం ఇదే...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan image 2
Updated:  2018-03-12 12:58:39

గుంటూరులో ప‌వ‌న్ నివాసం అస‌లు కార‌ణం ఇదే...

జ‌నసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తి గుంటూరు జిల్లాకు షిఫ్ట్ అయ్యారు... సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో తాను ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకే గుంటూరులో నివాసం ఏర్పాటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది... అందులో భాగంగానే తాను ఎప్ప‌టి నుంచో అమ‌రావ‌తి ప్రాంగ‌ణంలో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు త‌న‌కు ఆశ‌వుండేద‌ని తెలిపారు ప‌వ‌న్... అందుకోసం రెండు ఎక‌రాల విస్తీర్ణం క‌లిగిన భూమిలో పవ‌న్ నివాసంతో పాటు జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం కూడా నిర్మించ‌నున్నారు...
 
గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే... ప‌లు ప్రాంతాల‌లో త‌ప్పులు జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే త‌న దృష్టికి తీసుకురావాలంటే, త‌ప్ప‌ని స‌రి తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉండాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంద‌ని ప‌వ‌న్ తెలిపారు... దీంతో పాటు తాను ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌న్నా, ప్ర‌జ‌లు త‌న ద‌గ్గ‌ర‌కు రావాల‌న్నా ఇక్క‌డ ఉంటే అది చాలా సులువుగా ఉంటుంద‌ని ప‌వ‌న్ అన్నారు..అలాగే ఈ నెల 14న  జ‌న‌పేన పార్టీ కార్యాచ‌ర‌ణ‌ను వివ‌రిస్తాన‌ని చెప్పుకొచ్చారు..
 
అయితే దీంతో పాటు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిల్లో త‌న పార్టీ త‌రుపున అభ్య‌ర్థులు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో పోటీ చేయ‌నున్నారని పవ‌న్ అన్నారు... త‌న రాజ‌కీయ జీవితంలో కీల‌క స‌మ‌యం ఆస‌న్న‌మైన‌దని చెప్పారు జ‌న‌సేనాని.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.