ప‌వ‌న్ ప్రెస్ మీట్ హైలెట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 05:45:07

ప‌వ‌న్ ప్రెస్ మీట్ హైలెట్స్

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు
 
టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు మృతికి సంతాపం  తెలిపారు.
 
పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. 
 
 కేంద్ర‌ ప్రభుత్వం ఏపీకి రావాల్సిన వాటిని సాధించేందుకు  జాయింట్  యాక్ష‌న్ క‌మిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నాన‌న్నారు.
 
ఇందులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి,జయ‌ప్ర‌కాష్ నారాయ‌ణ వంటి వారు ఉండాలి.
 
జేఏసీ ఏర్పాటు కోసం  స్వ‌యంగా వెళ్లి వారిని క‌ల‌వ‌నున్న‌ట్లు తెలిపారు.
 
2014 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా త‌ప్పుచేశా...పోటీ చేసి ఉంటే చ‌ట్ట‌స‌భ‌ల్లో  ప్ర‌శ్నించేందుకు అవ‌కాశం ఉండేదన్నారు.
 
గురువారం ఏపీలో జ‌ర‌గ‌నున్న బంద్ కు  శాంతి యుతంగా నిర‌స‌న తెలిపే విధంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.
 
జేఏసీ ఆలోచ‌న‌తో  చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తున్నాను....ఎన్ని స్ధానాల్లో పోటీ చేయ‌నున్నాను అనే విష‌యాలు ఇప్పుడు మాట్లాడ‌నని అన్నారు.
 
జేఏసీ క‌మిటీకి అన్ని పొలిటిక‌ల్ పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వాలని కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.